ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీ టీమ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈనెల 29 ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5.49 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్‌ను ఎప్పటిలాగే యూట్యూబ్‌లోనే కాకుండా ఏకకాలంలో 152 థియేటర్లలోనూ రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడులోని మొత్తం 152 థియేటర్లలో …
Read More »నాకెలాంటి కోపం లేదు: మాజీ మంత్రి బాలినేని
మంత్రి పదవి విషయంలో తనకెలాంటి కోపం లేదని మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి పదవి అంశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను అప్పుడే ఖండించానని చెప్పారు. జగన్ ఆలోచన మేరకే మంత్రి పదవులు వస్తాయన్నారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి తాను తొలి నుంచి విధేయుడినని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలను …
Read More »మాజీ మంత్రి కొడాలి నానికి కీలక పదవి?
ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కొడాలి నానికి కీలక పదవి ఇచ్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్‌గా కొడాలి నానిని నియమించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఆ ఛైర్మన్ పదవికి కేబినెట్ హోదా కల్పించాలనేది జగన్ ఆలోచనగా వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మరో …
Read More »ఏపీలో మళ్లీ 5 మంది డిప్యూటీ సీఎంలు.. మంత్రుల శాఖలివే..
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్ కొలువుదీరింది. నూతన మంత్రులుగా 25 మంది ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారితో ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శాఖలను కేటాయించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ,అంజాద్ బాషా, నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. నారాయణస్వామి గత మంత్రివర్గంలోనూ డిప్యూటీ …
Read More »పూరీ జగన్నాథ్ చిరకాల కోరిక నెరవేర్చిన చిరంజీవి!
ఎన్నో ఏళ్లుగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కలగా మిగిలిపోయిన కోరికను ప్రముఖ నటుడు చిరంజీవి నిజం చేశారు. ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ మూవీలోని ఓ కీలక పాత్రలో పూరీ జగన్నాథ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూరీ జగన్నాథ్‌కు చిన్నప్పటి నుంచి సినీ పరిశ్రమపై ఎంతో అభిమానం. యాక్టర్ కావాలని ఎన్నో కలలు …
Read More »అక్కినేని అఖిల్‌పై సమంత పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్
నటుడు అక్కినేని అఖిల్‌ను ఉద్దేశించి ప్రముఖ నటి సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత తొలిసారిగా అఖిల్‌పై సామ్ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. అఖిల్ బర్త్ డే సందర్భంగా అతనికి విషెష్ తెలుపుతూ సమంత పోస్ట్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. నువ్వు దేనికోసమైతే కలలు కంటున్నావో అవన్నీ నిజం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తాను. ఈ ఇయర్ నీకు …
Read More »గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ల ధర భారీగా తగ్గింపు
దేశ ప్రజలకు ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. కరోనా నియంత్రణకు సంబంధించిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. రేపటి నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్ డోసు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధరలను భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కొవిషీల్డ్ ధర ప్రైవేట్ హాస్పటల్స్‌లో రూ.225 ఉండనున్నట్లు ఆ సంస్థ సీఈవో …
Read More »కేసీఆర్ ముందే చెప్పినా బీజేపీ నేతలు రెచ్చగొట్టారు: కేటీఆర్
రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని.. ఇప్పుడు ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదని కేసీఆర్ ముందే రైతులకు సూచించారని.. అయినప్పటికీ రైతులను బీజేపీ నేతలు రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని …
Read More »ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. వాళ్లకి ఆహ్వానాలు వెళ్లాయ్!
ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11న మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానపత్రాలు, పాస్‌లు పంపుతున్నారు. పాత, కొత్త మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు ఈ ఆహ్వానపత్రాలు వెళ్తున్నాయి. ప్రజాప్రతినిధుల స్థాయిని బట్టి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాస్‌లను జారీ చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్‌తో తేనీటి …
Read More »డ్రగ్స్ వెనుక సొంతపార్టీ వాళ్లున్నా వదలం: శ్రీనివాస్ గౌడ్
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలో పేకాట క్లబ్‌లు మూసివేయించారని.. ఆ తర్వాత గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై పోలీసుల దాడిలో కొన్ని రకాల మత్తు పదార్థాలు లభ్యమైన నేపథ్యలో హైదరాబాద్‌లోని పబ్ యజమానులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో …
Read More »