ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 299 మందికి పాజిటివ్ రాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 100 మందికి.. విదేశాల నుంచి వచ్చినవారిలో 26 మందికి పాజిటివ్ వచ్చినట్లు …
Read More »చైనా యాప్‌లు వాడుతున్నారా
చైనాకు చెందిన యాప్‌లను మరీ విచ్చలవిడిగా వాడుతున్నారు. అయి తే తాజాగా చైనాతో సంబంధం ఉన్న 52 మొబైల్ అప్లికేషన్లపై భారత ఇంటెలీజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు, ఆందోళనలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వం వీటిని బ్లాక్ చేయడమో లేదా వినియోగాన్ని నిలిపివేయాలని ప్రజలను కోరడమో చేయాలని కోరాయి. ఈఅప్లికేషన్లు సురక్షితం కాదని, ఇవి వినియోగదారుల సమాచారాన్ని దేశం వెలుపలికి సమీకరించుకుపోతున్నాయంటూ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి పంపిన …
Read More »బాలీవుడ్ కు అందుకే దూరం-రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు
దక్షిణాదిన స్టార్ హీరోలందరితోనూ నటించి అగ్ర కథానాయికగా వెలుగొందారు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ రోల్స్‌కు మారిన తర్వాత కూడా ఆమె మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇటీవల `బాహుబలి`తో ఉత్తరాదిన కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా `ఫైటర్`తో మరోసారి బాలీవుడ్‌ను పలకరించబోతున్నారు. నిజానికి హీరోయిన్‌గా రమ్యకృష్ణ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. `క్రిమినల్`, `కల్‌నాయక్`, `బడేమియా చోటేమియా` వంటి …
Read More »తల్లిగా బాధగా ఉన్న గర్విస్తున్నాను-సంతోష్ తల్లి
భారత్ – చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు వీరమరణం పొందడంపై ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. అయితే, తమ కుమారుడి మరణంపై ఆ మాతృమూర్తి స్ఫూర్తిదాయకంగా స్పందించారు. ‘‘నా కుమారుడు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉంది.. కానీ తల్లిగా బాధగానూ ఉంది’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారా వీరమాత. తమకు ఉన్న ఒక్కగానొక్క …
Read More »వైసీపీ నేతలపై ఎంపీ రఘురామకృష్ణరాజు పంచ్ డైలాగ్
వైకాపా నేతల తీరుపై ఆ పార్టీ ఎంపీ రఘు రామకృష్ణరాజు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తనపై వైకాపా నాయకులు చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ రజనీకాంత్ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే తానూ చేస్తానని సవాల్ విసిరారు.
Read More »తెలంగాణలో రైతుబంధు మార్గదర్శకాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వారం, పది రోజుల్లోనే ఈ నగదును రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందుకనుగుణంగా మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.5వేలు చొప్పున రైతుబంధు సాయం అందించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో జనవరి …
Read More »తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 269 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. తాజాగా మరో నలుగురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 192కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు 3,071మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రల్లో 2,412మంది చికిత్స పొందుతున్నారు. …
Read More »సంతోశ్ బాబు కుటుంబానికి అండగా ఉంటాం
భారత – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని… ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా …
Read More »తనకు కరోనా వార్తలపై ఎమ్మెల్యే పద్మాదేవెందర్ రెడ్డి క్లారిటీ
తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మాదేవేందర్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తప్పుడు ప్రచారం …
Read More »మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు
ఏపీ మాజీ మంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన‍్న పాత్రుడుపై కేసు నమోదయ్యింది. నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఆయన తాత లచ్చాపాత్రుడు ఫోటోని మరో గదిలో తాత్కాలికంగా మార్చిన దశలో తన పట్ల అయ్యన్న అనుచితంగా మాట్లాడారంటూ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లచ్చాపాత్రుడు ఫోటోను మున్సిపల్ సిబ్బంది మార్చడంతో గత రెండు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయం ఎదుట …
Read More »