కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న భారతదేశంలో ఒక్కో రాష్ట్రం కరోనాను తరిమికొట్టడంలో విజయవంతంమవుతున్నాయి. త్రిపుర కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచిందని ఆ రాష్ట్ర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రెండో పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి కోలుకున్న తర్వాత కరోనా కేసులు లేని రాష్ట్రంగా మారిందన్నారు. త్రిపురలో తొలుత రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటి వ్యక్తికి ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచి …
Read More »తెలంగాణ పల్లెపల్లెనా ధాన్యరాశులు
తెలంగాణలో పల్లెపల్లెనా ధాన్యరాశులు కనిపిస్తున్నాయనీ, పక్కా ప్రణాళికతో ప్రభుత్వం కొనుగోళ్లను చేపడుతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మార్కెటింగ్ విధానంపై ఇతర రాష్ర్టాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని చెప్పారు. గురువారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం, అప్పాజీపల్లి, చిన్నఘణపూర్, మెదక్ మండలంలోని మంబోజిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కోసం …
Read More »రంగనాయక్ సాగర్ కు నేడు కాళేశ్వర నీళ్లు
కాళేశ్వర ప్రాజెక్టు మహోజ్వల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కారమవుతున్నది. నాలుగేండ్ల క్రితం మేడిగడ్డ వద్ద వెనుకకు అడుగులు వేయడం మొదలుపెట్టిన గోదావరి.. రంగనాయకసాగర్‌లో కాలుమోపడంతో సప్తపదులు పూర్తిచేసుకోనున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరిజలాలు.. రంగనాయకసాగర్‌లోకి వస్తున్నాయి. పది దశల ఎత్తిపోతలలో ఏడోదశ సంపూర్ణం కాబోతున్నది. శుక్రవారం చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ పంప్‌హౌజ్‌లోని నాలుగుమోటర్లలో ఒక మోటర్ వెట్ రన్ …
Read More »6 నెలల చిన్నారికి కరోనా
మేడ్చల్ జిల్లాలో ఆరునెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మకాలనీ పేజ్-3లో ఓ క్యాబ్ డ్రైవర్ కుటుంబం నివాసముంటున్నది. ఆరునెలల తన కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సదరు క్యాబ్ డ్రైవర్ ఈ నెల 8న హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. వెంటనే పాపను గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read More »కొత్త దరఖాస్తుదారులకూ రేషన్
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఎవరైతే ఇప్పటివరకు రైస్‌కార్డు లేకుండా కొత్తగా కార్డుకోసం దరఖాస్తు చేసుకొన్నారో వారిలో అర్హులకు సరుకులు పంపిణీ చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆ దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఆరు అంచెల మూల్యాంకనం చేయాలన్నారు. ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాల్సిందిగా తెనాలి సబ్ కలెక్టర్, నాలుగు డివిజన్ల ఆర్డీవోలు, తమసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్‌లు, సీఎస్‌డీటీలను జేసీ ఆదేశించారు.
Read More »కోవిడ్ నేపథ్యంలో ఆవిర్భావ పండుగను నిరాడంబరంగా జరుపుకుందాం
ఈనెల (ఏప్రిల్) 27 తో తెలంగాణ రాష్ట్ర సమితికి 20 సంవత్సరాలు నిండుతున్నాయి. మామూలుగా అయితే ఈ పండుగను ఉత్సవ వాతావరణంలో జరుపుకోవాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో, చాలా సాదాసీదాగా ఈ 20 ఏళ్ల ఆవిర్భావ పండుగను జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ యువ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావం …
Read More »కరోనా నియంత్రణలో తెలంగాణ భేష్
కరోనా మహమ్మారి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు సవాళ్ళను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా. శాసనసభ లోని స్పీకర్ గారి ఛాంబర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రం తరుఫున పాల్గొన్న శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, …
Read More »తెలంగాణ లో కొత్తగా 56 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే యాబై ఆరు కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. వీటితో కలిపి మొత్తం కరోనా కేసులు సంఖ్య 928కి చేరుకుంది .మంగళవారం ఎనిమిది మంది కోలుకుని డి శ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలి పింది. అయితే ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 24మంది మృతి చెందారు. అత్యధికం గా సూర్యాపేటలో 26కేసులు నమోదు అయ్యాయి.
Read More »ప్రపంచ వ్యాప్తంగా 25లక్షలు దాటిన కరోనా కేసులు
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతుంది.మంగళవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 25.03లక్షలకు చేరుకుంది.ఇందులో 1,71,810 మంది మృత్యు ఒడిలోకి చేరారు.అయితే ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి అనే సంగతి తెలుసుకుందాం. అమెరికాలో 7,92,958కేసులు నమోదు అయితే వీరిలో 42,531మృతి చెందారు. స్పెయిన్ లో 2,04,178కేసులు నమోదు అయితే 21,282మరణాలు చోటు చేసుకున్నాయి.ఇటలీలో 1,81,228కేసులు నమోదు …
Read More »కరోనా అక్కడ జన్మించలేదు
ప్రపంచానికి చెమటలు పట్టిస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో జన్మించిందంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర నిపుణులు సైతం అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే వైరస్ తమ సృష్టి కాదని, అపనవసరంగా నిందలు వేయడం తగదని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధికారులు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. తాజాగా ఇదే అభిప్రాయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వ్యక్తం చేసింది. వైరస్ …
Read More »