ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాటలో నడవనున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ ఆలోచన ప్రభావం కర్ణాటక రాష్ట్రంపై పండింది. దీంతో ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం బెంగళూరు నుండి కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకు బీజేపీ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రక్రియకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉత్తర కర్ణాటక …
Read More »డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు సహకార శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 22న జిల్లా సహకార ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. 25న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంట వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల …
Read More »ప్రపంచంలోనే ఏకైక క్రికెటర్ టేలర్
కివీస్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రాస్ టేలర్ కెరీర్ లో వంద మ్యాచ్ కావడం విశేషం. దీంతో అన్ని ఫార్మాట్ల(టెస్టులు,వన్డేలు,టీ20)లో వంద మ్యాచులు ఆడిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో మరే క్రికెటర్ ఈ ఘనతను సాధించలేదు. ఇప్పటివరకు టెస్టుల్లో 7174పరుగులు చేశాడు. ఇందులో 19సెంచరీలు… 33హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read More »భారత్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించనున్నడు. అయితే భారత్ పర్యటనకు ముందే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “త్వరలోనే భారత్ కు వెళ్లబోతున్నాను. వాళ్లు కొన్నేళ్లుగా అధిక ట్యాక్సులతో మనల్ని కొడుతున్నారు. పీఎం మోడీ అంటే చాలా ఇష్టం.కానీ ఈసారి బిజినెస్ గురించి వాళ్లతో చర్చిస్తాను. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధిస్తున్న దేశాల్లో మనకు భారత్ ఒకటి అంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read More »ముస్లీంలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ వివాదస్పద వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”1947లోనే ముస్లీంలందర్నీ పాకిస్తాన్ కు పంపించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక ముస్లీం దేశం కావాలని 1947పూర్వమే మహమ్మద్ జిన్నా ఒత్తిడి తెచ్చారు. అందుకూ మన పూర్వీకులు కూడా ఒప్పుకున్నారని ఆయన అన్నారు. అప్పుడే కనుక ముస్లీంలను పాక్ కు పంపించి అక్కడి హిందువులను ఇక్కడి తీసుకొస్తే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కునే వారమే కాదని తెలిపారు.
Read More »టీవీ సౌండ్ పెంచాడని చంపేశాడు
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది.టీవీ సౌండ్ పెంచాలన్న భయం వేసిన సంఘటన ఇది. ఆర్మూర్ లో రాజేంద్ర (40)ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలనర్సయ్య అనే వ్యక్తి తన భార్యతో గొడవపడుతున్నాడు. వీరు పెద్దగా అరుచుకుంటుండడంతో రాజేంద్ర టీవీలో సరిగ్గా వినిపించడంలేదు అని టీవీ సౌండ్ పెంచాడు. దీంతో సౌండ్ ఎందుకు పెంచావని ఓనరుతో గొడవకు దిగాడు బాలనర్సయ్య. ఈ క్రమంలో రాజేంద్ర …
Read More »కివీస్ గడ్డపై మయాంక్ రికార్డు
వెల్లింగ్టన్ వేదికగా ఈ రోజు శుక్రవారం కివీస్ తో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి విదితమే. అయితే వర్షం అడ్డు రావడంతో తొలి రోజు మ్యాచ్ ను అంపెర్లు నిలిపేశారు. ఈ క్రమంలో కివీస్ తో తొలి టెస్టు మ్యాచులో భారత్ ఓపెనర్ మయాంక్ అరుదైన క్లబ్ లో చేరాడు. కివీస్ గడ్డపై తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన రెండో టీమిండియా ఓపెనర్ గా నిలిచాడు. …
Read More »క్రికెట్ కు ఓజా గుడ్ బై
టీమిండియా వెటర్నర్ ఆటగాడు.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా అంతర్జాతీయ ,దేశవాళీ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. 2009లో శ్రీలంకపై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. మొత్తం 24టెస్టుల్లో 113 వికెట్లు తీశాడు.ఇటు పద్దెనిమిది వన్డే మ్యాచుల్లో ఇరవై ఒక్క వికెట్లను..ఆరు టీ20 మ్యాచుల్లో పది వికెట్లు తీశాడు. 2013లో సచిన రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ …
Read More »బాబు ఆస్తులు ఎంతో తెలుసా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నికర ఆస్తి విలువ 3.87 కోట్లు అని ఆయన కుమారుడు ,మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు చెప్పారు. తమ కుటుంబ ఆస్తుల వివరాలను ఆయన ప్రకటించారు. చంద్రబాబు ఆస్తి విలువ తొమ్మిది కోట్ల వరకు ఉంటే, అప్పులు5.13 కోట్లు అని ఆయన తెలిపారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు …
Read More »చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ
ఏపీ మాజీ సీఎం..ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి భద్రత తగ్గించారు. రాజకీయ కోణంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని ఆ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే బాబు భద్రతపై తెలుగు తమ్ముళ్ళు చేస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర డీజీపీ కార్యాలయం క్లారిటీచ్చారు. బాబుకు భద్రతను తగ్గించామని వచ్చిన వార్తలను డీజీపీ ఆఫీసు కొట్టిపారేసింది.దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని మాజీ …
Read More »