దిగువనుంచి వస్తున్న జలాలతో గోదారి ఎదురెక్కుతున్నది. మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లతోపాటు.. మానేరులోనూ పెద్దఎత్తున నీరు పోగుపడుతుండటంతో క్రమేణా విస్తరిస్తున్నది. ప్రాణహితనుంచి వస్తున్న వరదనీటిని సాగునీటిశాఖ ఇంజినీర్లు మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లలో నిల్వచేస్తున్నారు. మేడిగడ్డలో మొత్తం అన్ని గేట్లను మూసివేయడంతో శుక్రవారానికి సుమారు 4.50 టీఎంసీల నీరు చేరింది. ఫలితంగా ఇక్కడ గోదావరిలో బ్యాక్‌వాటర్ 20 కిలోమీటర్ల వరకు విస్తరించింది. అటు అన్నారం బరాజ్‌లో నీటినిల్వ 2.50 టీఎంసీలు దాటింది. దీంతో …
Read More »మోదీ సర్కారుకు సుప్రీం షాక్.
కేంద్ర ప్రభుత్వం 800ల పెన్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం 200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తుందన్న అబద్ధాలపై సుప్రీంకోర్టు సీరియస్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 200 రూపాయల పెన్షన్ నిరాధార పౌరులకు ఏమూలకు సరిపోతుందని ఏ రకంగా ఆసర కాగలదని ప్రశ్నించింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి హాయిగా తిరుగుతుంటే వారిని ఎందుకు అరెస్టు చేయలేదని అలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడే …
Read More »ఈనెల 18, 19 తేదీల్లో తెలంగాణ శాసనసభ సమావేశాలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న గురువారం ప్రగతిభవన్‌లో పురపాలక ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో పురపాలక ఎన్నికలను కొత్త చట్టంతోనే నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై కొత్త పురపాలక బిల్లును ఆమోదించనుంది. గతంలో ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఎన్నికల ప్రకటన ఇచ్చి ఈ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తర్వాతే …
Read More »ఏపీ మంత్రిని కలిసిన చిరు..!
కాంగ్రెస్ మాజీ ఎంపీ ,టాలీవుడు సీనియర్ స్టార్ హీరో కొణిదెల చిరంజీవి ఈ రోజు శుక్రవారం నవ్యాంధ్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కలిశారు.ఈ క్రమంలో మంత్రి కన్నబాబు సోదరుడు సురేష్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో సురేష్ మరణంతో కురసాల ఇంట విషాదం నెలకొంది.దీనికారణంగానే మంత్రి కన్నబాబు బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరుకాలేకపోయారు. నేడు సురేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోదర …
Read More »నిను వీడని నీడను నేనే హిట్టా. ఫట్టా..!
టైటిల్ : నిను వీడని నీడను నేనే జానర్ : థ్రిల్లర్ తారాగణం : సందీప్ కిషన్, అన్యా సింగ్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ సంగీతం : తమన్ దర్శకత్వం : కార్తీక్ రాజు నిర్మాత : సందీప్ కిషన్, సుప్రియ కంచర్ల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ హీరోగా సక్సెస్ వేటలో వెనుకపడుతున్నాడు. కెరీర్‌లో ఒక్క వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోవటంతో తన కెరీర్‌ను …
Read More »అభాగ్యుడికి మంత్రి సింగిరెడ్డి భరోసా..!
తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం నరసింగపల్లి గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వారికి చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధితుడ్ని పరామర్శించారు. జిల్లా ఏరియా ఆస్పత్రి డాక్టర్ తో మంత్రి మెరుగైన చికిత్స ఇవ్వాలని సూచించారు. బాధితుడ్ని పరామర్శించిన వారిలో వనపర్తి మాజీ మున్సిపల్ …
Read More »నిరుద్యోగ యువతకు టీసర్కారు గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా రాష్ట్రంలో గురుకులాల్లో ఉన్న పలు పోస్టుల భర్తీకి సర్కారు పచ్చ జెండా ఊపింది. దీంతో రాష్ట్రంలో బీసీ గురుకులాల్లో ఉన్న 1698ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతులు జారీ చేసింది. గురుకులాల్లో ఉన్న 1071 టీజీటీ,119పీఈటీతో పాటుగా ముప్పై ఆరు ప్రిన్సిపల్ సహా పలు ఇతర పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ …
Read More »కర్ణాటక రాష్ట్ర సంక్షోభంలో మరో ట్విస్ట్..!
కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. విస్తృత రాజ్యాంగ అంశాలపై స్పష్టత వచ్చేవరకు తుది నిర్ణయం తీసుకోరాదంటూ కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16 వరకు వాయిదా వేసింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను …
Read More »సిద్దిపేట హరిత సైనికుల ప్రతిజ్ఞ
రోజురోజుకు వాతావరణంలో ఉష్షోగ్రతలు పెరిగి పోతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవటం లేదు. మానవ మనుగడే దుర్లభంగా మారుతున్నది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటమే ఈ అనర్థానికి ప్రధానమైన కారణం. ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు, భూ భాగంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణకు హరితహారం అనే పవిత్ర యజ్ఞం చేపట్టారు. విరివిగా చెట్లు పెంచటమే లక్ష్యంగా సాగే ఈ …
Read More »కర్ణాటక ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం..!
కర్నాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం క్షణానికోక విధంగా అనూహ్యంగా మారుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం చుట్టిముట్టిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక వ్యూహాత్మక ప్రకటన చేశారు. తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానానికి కుమారస్వామి సిద్ధమయ్యారు.దీంతో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమని కుమారస్వామి ప్రకటించారు. అందులో భాగంగా బీజేపీ తేరుకోకముందే విశ్వాసాన్ని నిరూపించుకునే ఎత్తుగడలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.మరి దీనికి స్పీకర్ సమయం ఎప్పుడు …
Read More »