ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేదని కేంద్రం తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం 2026 సంవత్సరం అనంతరం జనాభా లెక్కలు పూర్తయిన తరువాతే నియోజకవర్గాల పునర్విభజన జరపవచ్చని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. పునర్విభజనలో భాగంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉండదని ఆయన స్పష్టం …
Read More »అందుబాటులోకి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న సంగతి తెల్సిందే. వచ్చే నెలలో జరిగే టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పదో తరగతి హాల్టికెట్లు విడుదల www.bse.telangana.gov.in వెబ్సైట్లో విద్యార్థులు తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిపై HM సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే తెలిపింది. ఈసారి 4.94 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు …
Read More »మార్చి 29న ఆవిర్భావ దినోత్సవ భారీ బహిరంగ సభ
ఏపీలో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం 42వ ఆవిర్భావ దినోత్సవ సభను ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు ఆ పార్టీ తెలంగాణ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల …
Read More »ఏపీ మండలిలో బలం పెంచుకున్న వైసీపీ
ఏపీలో నిన్న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఏడు స్థానాలు.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఒక స్థానంలో గెలుపొందాయి. దీంతో శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. తాజాగా జరిగిన స్థానిక సంస్థలు, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వైసీపీ బలం భారీగా పెరిగి 44కు(గవర్నర్ కోటాతో కలిపి) చేరనుంది. ప్రధానప్రతిపక్షమైన టీడీపీ సభ్యుల సంఖ్య 17 …
Read More »మళ్లీ రిపీట్ అవుతున్న నితిన్ రష్మీ జోడీ
చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం భీష్మ. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో యువహీరో నితిన్,నేషనల్ క్రష్ రష్మిక జోడీగా రూపొందిన భీష్మ చిత్రం సూపర్ హిట్ గా కూడా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది. ఇందులో భాగంగా జరిగే పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కొత్త చిత్రంలో భీష్ము …
Read More »ఆ యువఎంపీతో ప్రేమయాణంలో పరిణీతి చోప్రా
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ అయిన కోలీవుడ్ ఇండస్ట్రీ అయిన అఖరికి హాలీవుడ్ ఇండస్ట్రీ అయిన హీరోయిన్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తన రంగానికి చెందిన లేదా రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులతో డేటింగ్ చేయడమో.. ప్రేమయాణం నడపడమో మనం చూస్తూ ఉంటాం. తాజాగా అదే కోవలో చేరిపోయారు బాలీవుడ్ సెక్సీ బ్యూటీ పరిణీతి చోప్రా. ఢిల్లీ అధికార పార్టీ అయిన ఆప్ …
Read More »అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం
తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ క్రమంలో హీరో అజిత్ తండ్రి పి. సుబ్రమణియం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరు ఆయన. అయితే ఆయన చెన్నైలో ఈరోజు శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు దుబాయ్ వెళ్లిన అజిత్.. తండ్రి మరణవార్త తెలిసి హుటాహుటిన చెన్నైకి బయల్దేరినట్లు తెలుస్తోంది.
Read More »ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు
కరోనా మహమ్మారి తర్వాత వరుస సినిమాలతో.. వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న స్టార్ సీనియర్ హీరో మాస్ మహారాజ్ రవితేజ. అయితే తాజాగా ఆయన కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన సోదరుడు రఘు రాజు కుమారుడు మాధవ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. పెళ్లి సందD ఫేమ్ గౌరీ రోణంకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా రవితేజ ట్విటర్ లో పోస్టు చేస్తూ.. …
Read More »మరో వివాదంలో కంగనా
ఎప్పుడు ఏదోక వివాదంలో ఉండకపోతే తనకు నిద్రపట్టనట్లుంది బాలీవుడ్ వివాదస్పద బ్యూటీ కంగనా రనౌత్. తాజాగా తన శత్రువులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న గురువారం ఈ బ్యూటీ తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో బ్యూటీ కంగనా మాట్లాడుతూ ఇన్నేండ్ల నా జీవిత ప్రయాణంలో భాగమైన తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక గురువులు, స్వామి వివేకానందతోపాటు శత్రువులనూ గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపింది. …
Read More »భారత్ లో మళ్లీ కరోనా కలవరం
భారతదేశంలో నాలుగున్నర నెలల తర్వాత అంటే దాదాపు 140 రోజుల తర్వాత భారీగా కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. గడిచిన గత 24 గంటల వ్యవధిలో 1,300 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే 166 కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,605గా ఉంది. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,99,418 …
Read More »