ప్రధానమంత్రి నరేందర్ మోదీకి కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఫైర్ అయ్యారు. ‘పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు.. ఇలా అన్ని అదానీకే కట్టబెడుతున్నారు. దేశం మొత్తం అదానీకి అప్పగిస్తారా? హిండెన్బర్గ్ రిపోర్ట్ పై మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అదానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోదీకి ఉందా? అదానీ సంపద …
Read More »విజయ్ సేతుపతి సంచలన వ్యాఖ్యలు
తాను పాన్ ఇండియా నటుడిని కాదని.. కేవలం నటుడినేనన్నారు ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతి. ‘పాన్ ఇండియా యాక్టర్ అనే స్టేట్మెంట్ నాకు అంత సౌకర్యంగా ఉండదు. అది కొన్నిసార్లు నన్ను ఒత్తిడికి గురిచేస్తుంది. నేను కేవలం నటుడినే. దాని కింద ఎలాంటి ట్యాగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అన్ని భాషల్లో నటించడానికి ఇష్టపడతా. అవకాశం వస్తే బెంగాలీ, గుజరాతీలో కూడా’ అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.
Read More »తెలంగాణ ఐపీఎస్ లు బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర్లు, సైబరాబాద్ పరిపాలన డీసీపీగా యోగేశ్ గౌతమ్, పీసీఎస్ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్ డీసీపీగా రాఘవేందర్‌రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీశ్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్‌గా నియమిస్తూ ప్రభుత్వం …
Read More »తెలంగాణ ఉపాధ్యాయులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు 317లో వేరే జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి సీఎం కేసీఆర్ సూచనల మేరకు అవకాశం ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా …
Read More »మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర సీఎల్పీ నేత బాలాసాహెబ్ థొరట్ తన పదవికి రాజీనామా చేశారు. సీఎల్పీ నేతగా వైదొలగుతున్నట్టు థొరట్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు ఈరోజు మంగళవారం లేఖ రాశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలెతో తాను కలిసిపనిచేయలేనని పార్టీ కేంద్ర నాయకత్వానికి థొరట్ స్పష్టం చేశారని ఆయన సన్నిహితుడు సోమవారం వెల్లడించారు. నానా పటోలె వ్యవహార శైలికి నిరసనగా …
Read More »రెచ్చిపోయిన అనుపమ
మార్చి 10న యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కోకాపేట లో నిర్మిస్తున్న యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను మార్చి 10 వ తేదీన ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మంగళవారం కోకాపేట లోని యాదవ, కురుమ భవనాలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, MLC లు ఎగ్గే మల్లేశం, బండ ప్రకాష్ ముదిరాజ్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, …
Read More »ఎములాడని యాదగిరిగుట్టలా అభివృద్ధి చేస్తాం
దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. వేములవాడలో జరగనున్న మహాశివరాత్రి వేడుకలపై స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబుతో కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో యాదగిరిగుట్ట తరహాలో వేములవాడను అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. శివరాత్రి ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేములవాడ గుడి చెరువును వరంగల్ బండ్ తరహాలో నిర్మించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు …
Read More »కేంద్ర మంత్రి గడ్కరీని కల్సిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య
ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారులను మరింత విస్తరించాల్సిందిగా, రోడ్లకిరువైపులా డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగాకోరుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డిలతో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు.ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం వారు గడ్కరీతో సమావేశమై తమ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా …
Read More »మాజీ ఎంపీ పొంగులేటికి మంత్రి పువ్వాడ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దమ్ముంటే తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి అని పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల …
Read More »