తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దమ్ముంటే తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి అని పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పువ్వాడ పాల్గొని ప్రసంగించారు.బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ద్వారా గెలిచి పొంగులేటికి వంత పాడుతున్న నేతలంతా తక్షణమే రాజీనామా చేయాలి అని మంత్రి డిమాండ్ చేశారు.
లేదంటే పార్టీ క్రమశిక్షణా చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న వారంతా కేసీఆర్‌కు విధేయులే. నా బ్రాండ్ నా గ్రూప్ అంటే కుదరదు అని పువ్వాడ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్.. పొంగులేటి లాంటి వ్యక్తులను రాష్ట్రంలో ఎంతో మందిని చూశారు. పార్టీ శాసనసభా పక్షాన్ని 2009లో చీల్చే ప్రయత్నం చేసినప్పుడే కేసీఆర్ చలించలేదు అని గుర్తు చేశారు.