తెలంగాణలో నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు.మామిడి పేరు వినపడగానే నోరూరించే బంగినపల్లి మామిడిని పోలి ఉండే ఈ వంగడానికి గంగా గా నామకరణం చేశారు. ఈ మేరకు హార్టికల్చర్ రంగంలో విశిష్ట గుర్తింపు ఉన్న గంగా నర్సరీ అధినేత ఐ సి మోహన్ ఆ వంగడాన్ని సోమవారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి …
Read More »హాఫ్ శారీలో మత్తెక్కిస్తున్న భామ
తిరుమలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పండితులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవాలని ఆకాంక్షించారు.
Read More »మంత్రి కేటీఆర్ అభిమానులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే Kp…
సిరిసిల్లా నియోజకవర్గం పరిధిలోని గంభీరావు పేట మండల కేంద్రం నుండి గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి అభిమానులు ఎగదండి రవి, గ్యార నగేష్, ఆవునూరి పరశురాములు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా ఈ నెల 11వ తేదీ నుండి హైదరాబాద్ ప్రగతిభవన్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మీదుగా ఈరోజు వెళుతుండగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ …
Read More »రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కల్సి పని చేస్తేనే అభివృద్ధి
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో కేంద్రం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రాలకు కోట్ల నిధులు కేటాయించామని ఆమె వెల్లడించారు. మంగళగిరి ఎయిమ్స్‌కు కేంద్రం రూ. 1618 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రజాసేవ కోసం కేంద్ర, …
Read More »సీఎం కేసీఆర్ కు మద్ధతుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
దేశంలో ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైనదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో అన్నారు.విభజన రాజకీయాలతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వీటికి అడ్డుకట్ట వేయకపోతే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠ మరింత దిగజారిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సమర్థ ప్రతిపక్షంగా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం అనివార్యమని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ను …
Read More »ఐదేండ్ల లోపు పిల్లలకు ఇంటి దగ్గరే ఆధార్
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో చేరనున్న ఐదేండ్ల లోపు పిల్లల ఆధార్ వివరాలను వారి ఇండ్ల వద్దనే పోస్టల్‌శాఖ ఉచితంగా నమోదు చేస్తుందని హైదరాబాద్ రీజియన్ పోస్టాఫీస్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లల పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫొటో, బయోమెట్రిక్ తదితర వివరాలను తల్లిదండ్రులు తమ ఇంటి వద్దకు వచ్చిన పోస్టుమ్యాన్‌కు అందజేయాలని సూచించారు. తెలంగాణలో 1,552 మంది డాక్‌సేవక్‌లు, పోస్ట్‌మ్యాన్‌లు ఆధార్ నమోదు సేవల్లో పాల్గొంటారని …
Read More »సీఎం కేసీఆర్ కు మద్ధతు వెల్లువ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ నిన్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ త్వరలో దిల్లీకి వెళ్లి కార్యకలాపాలను ప్రారంభించాలనుకోవడం మంచిదేనని అన్నారు. రాజకీయ లక్ష్యం విషయంలో కేసీఆర్‌కు స్పష్టమైన వైఖరి ఉండాలని అభిప్రాయపడ్డారు. త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున అభ్యర్థి ఒకరే అయితే …
Read More »దేశం పిలుస్తోంది-EDITORIAL.
దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్రమైన శూన్యత నెలకొని ఉన్నది. సమర్థమైన నాయకత్వ శూన్యత స్పష్టంగా ఉన్నదన్నది నిపుణుల మాట. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వామపక్ష భావజాలం జాతీయస్థాయిలో ప్రభావవంతంగా లేదు. అటు కీలకమైన కాంగ్రెస్ పార్టీ దీటుగా స్పందించే స్థితిలో లేదు. సోషలిస్టుల ప్రాభవం పూర్తిగా కనుమరుగైంది. ములాయం, లాలూ, శరద్‌యాదవ్ వంటి దిగ్గజాల వారసులు తమ తమ ప్రాంతాలను దాటి జాతీయ స్థాయికి ఇంకా అడుగులు వేయడం లేదు. జనతా …
Read More »హ్యాపీ బర్త్ డే గోపిచంద్ -Special Story
హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను కొత్త కథలతో ఎంటర్టైన్ చేయడంలో గోపిచంద్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. దిగ్గజ దర్శకుడు టి. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు కమర్షియల్ సినిమాలకు పెద్ద పీఠ వేస్తూనే మధ్య మధ్యలో కంటెంట్ సినిమాలను చేస్తున్నాడు. మొదట్లో ఈయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు మరో ఆలోచన లేకుండా థియేటర్లకు …
Read More »