Home / rameshbabu (page 373)

rameshbabu

మహిళా సంఘాలకు 18 వేల కోట్ల రుణాలు

మహిళా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను క్రమపద్ధతిలో చెల్లిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెర్ప్‌, స్త్రీనిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ.18,069 కోట్ల రుణాలను అందించనున్నట్టు వెల్లడించారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే రుణాల వార్షిక ప్రణాళికను విడుదల …

Read More »

తడిచిన ధాన్యంతో సహా చివరి గింజ వరకు కొంటాం’- సీఎం కేసీఆర్

తడిచిన వరిధాన్యాన్ని కూడా కొంటామని… ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్… రైతులకు భరోసానిచ్చారు. హైదరాబాద్​ ప్రగతిభవన్​లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వరిధాన్యం సేకరణపై సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వరిధాన్యం సేకరణపై ఆరా తీశారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి తదితర వరిధాన్య సేకరణ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని… …

Read More »

ప‌ద్మ శ్రీ తిమ్మ‌క్క‌ను ఘ‌నంగా స‌త్క‌రించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

ప్ర‌ముఖ పర్యావ‌ర‌ణ‌వేత్త,వృక్ష‌మాత‌, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌కులు, ప‌ద్మ శ్రీ తిమ్మ‌క్క‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌నంగా స‌త్క‌రించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు. క‌ర్ణాట‌క‌కు చెందిన సాలుమ‌ర‌ద తిమ్మ‌క్క‌(110) ఇవాళ బుధవారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి స‌మీక్షా స‌మావేశానికి తిమ్మ‌క్క‌ను కేసీఆర్ స్వ‌యంగా తీసుకెళ్లారు. ఈ స‌మావేశానికి హాజ‌రైన మంత్రులు, అధికారుల‌కు తిమ్మ‌క్క‌ను కేసీఆర్ ప‌రిచ‌యం చేశారు.

Read More »

ఊర్లో నీళ్లు లేవని పిల్లనివ్వడంలేదు

మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఉన్న ఖూస్రా గ్రామంలో అబ్బాయిలకు పిల్లనివ్వడానికి చుట్టు పక్కల ఊర్లవాళ్లు భయపడతారు. ఎందుకంటే తాగునీటి కోసం ఆ ఊళ్లో వాళ్లు కిలోమీటర్ల దూరం నడవాలి.ఊర్లో ఏ ఒక్క ఇంటికి నల్లా కనెక్షన్‌ లేదు. బోర్లు వేసినా చుక్క నీళ్లు లేవు. ఊరికి ఆవల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో అడవిలో ఉన్న చిన్న నీటి కాలువే ఖూస్రా గ్రామ ప్రజలకు ఆధారం. గ్రామంలో ప్రతీ ఇంట్లో ఒకరికి …

Read More »

దేశంలో కొత్తగా 1829 కరోనా కేసులు

దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1829 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,27,199కి చేరాయి. ఇందులో 4,25,87,259 మంది కోలుకున్నారు. మరో 5,24,293 మంది మృతిచెందగా, 15,647 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, 24 గంటల్లో 33 మంది కరోనాకు బలవగా, 2549 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారి పాజిటివిటీ రేటు కూడా పడిపోతున్నది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.42 …

Read More »

వనజీవి రామయ్య ఆరోగ్యంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరా

పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య ఆరోగ్యంపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆరా తీశారు. వనజీవి రామయ్య కుమారుడు కనకయ్యతో ఫోన్లో మాట్లాడిన మంత్రి..రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కాగా, బుధవారం ఉదయం పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్‌పై వెళ్తున్న రామయ్య రోడ్డు దాటుతుండగా …

Read More »

యూకేలోని ప్రవాసులకు థ్యాంక్స్‌- మంత్ర్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్‌ పర్యటనకు వెళ్తోన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌, యూకేలో ఉన్న ప్రవాస భారతీయులు థ్యాంక్స్‌ చెప్పారు. దావోస్‌లో జరిగే సమావేశానికి హాజరవడానికి ముందు ఆయన యూకేలో కూడా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యూకేలో ఉన్న తెలంగాణ ఎన్నారైలు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. లండన్‌ నగరంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. నంబర్‌ ప్లేట్‌ కేటీఆర్‌ అని ఉన్న కారులో ఆయన్ని ఎయిర్‌పోర్టులో రిసీవ్‌ …

Read More »

ద‌మ్ముంటే ఈ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబివ్వండి..?- బీజేపీ నేత‌ల‌కు ఎమ్మెల్సీ క‌విత స‌వాల్

ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్ట‌రీని అమ్మేందుకు సిద్ధ‌మైన కేంద్ర ప్ర‌భుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు క‌విత ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ద‌మ్ముంటే ఈ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు ఇవ్వాల‌ని ఆమె స‌వాల్ చేశారు. ఛ‌త్తీస్‌గ‌డ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కర్ణాటక, ఆదిలాబాద్‌లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat