బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ సోనాక్షి సిన్హా తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఢిల్లీలో ఓ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు రూ.37 లక్షలు తీసుకుందని, అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ ఆమెపై వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అంటూ సోనాక్షి స్టేట్మెంట్ ఇచ్చింది. అదంతా చేస్తోంది తనను వేధించటానికి ప్రయత్నిస్తోన్న ఓ మోసగాడేనని మండిపడింది. అతడు ఎవరో మాత్రం స్పష్టంగా చెప్పలేదు.
Read More »17 లక్షల కుటుంబాలకు దళితబంధు
తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అందుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ మైదానంలో 393 మంది దళితబంధు లబ్ధిదారులకు 202 వాహనాలను మంత్రి గంగుల కమలాకర్తో కలసి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ప్రతీ దళితుడు లక్షాధికారి కావాలన్న కేసీఆర్ సంకల్పానికి ఈ పథకం నిదర్శనమన్నారు.
Read More »మెంతులతో కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
మెంతులతో కలిగే ప్రయోజనాలు తెలుసా?.. ఆ ప్రయోజనాలు ఏంటో మీకోసం.. *పరగడుపున మెంతులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. *ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. *ఎముకలు బలంగా ఉంటాయి. *ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా నివారించవచ్చు.
Read More »తెలంగాణ ఎంసెట్ – 2022 నోటిఫికేషన్ ముహుర్తం ఖరారు
తెలంగాణ ఎంసెట్ – 2022 నోటిఫికేషన్ ఈ నెల 14న వెలువడే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలి సమీక్షా సమావేశంలో నోటిఫికేషన్ వెలువరించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అధికారులు తమకు సానుకూల తేదీలను సాంకేతిక తోడ్పాటును అందించే టీసీఎస్ సంస్థకు అందించారు. ఈ సంస్థ ఆయా తేదీల్లో ఎంసెట్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నిర్ధిష్టమైన తేదీలను విద్యామండలి ముందుకు తేనుంది.
Read More »బొద్దింకల నియంత్రణకు చిట్కాలు మీకోసం.
బొద్దింకల నియంత్రణకు చిట్కాలు మీకోసం. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *ఇంట్లోని మూలల్లో లవంగాలను ఉంచడం వల్ల బొద్దింకలు పారిపోతాయి. *కొంచెం నీటిలో కిరోసిన్ కలిపి ఇంటి మూలల్లో చల్లాలి. *బిరియానీ ఆకులను పొడిచేసి ఇంట్లోని మూలల్లో చల్లితే బొద్దింకలు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. *బొద్దింకల నియంత్రణ కోసం ఇంటిని ప్రతిరోజూ శుభ్రపరుచుకోండి.
Read More »శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. వీరి ఎన్నికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసన మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో.. రెండు పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
Read More »తెలంగాణలో వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభా
తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి 1.79 కోట్ల (46.84%) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75%) కంటే ఇది దాదాపు 12% అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 2.20 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా. రాష్ట్ర పట్టణ జనాభాలో హైదరాబాద్, మేడ్చల్ …
Read More »ఉక్రెయిన్ సంచలన నిర్ణయం
ఉక్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నాటో కూటమిలో చేరడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెనక్కి తగ్గారు. నాటోలో చేరాలనుకోవడం లేదని చెప్పారు. మాపై దాడి చేస్తున్న రష్యాపై నాటో దేశాలు పోరాటం చేయడం లేదన్నారు. స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన రష్యా నిర్ణయంపైనా రాజీ పడినట్లు తెలిపారు. రష్యా కూడా ఉక్రెయిన్ నుంచి ఇదే ఆశిస్తోంది. నాటోలో చేరొద్దని ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. తాజా ప్రకటన నేపథ్యంలో …
Read More »నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్
సర్కారు కొలువుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. దాదాపు లక్ష కొలువుల భర్తీకి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలతో పాటు కొత్త పోస్టుల భర్తీకి శాసనసభలో సీఎం కేసీఆర్ ఉదయం 10 గంటలకు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల …
Read More »వనపర్తి జిల్లాలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ జెండాను కేసీఆర్ గారు ఆవిష్కరించారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్‌ను కేసీఆర్ గారు కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని టీఆర్ఎస్ …
Read More »