అమూల్ పాల రేట్లు పెరిగాయి. నేటి నుంచి లీటరు పాలపై రూ.2 ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. అమూల్ గోల్డ్ 500 మి.లీ రూ.30, అమూల్ తాజా 500 మి.లీ. రూ.24, అమూల్ శక్తి 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 27 అయ్యాయని పేర్కొంది. పశుగ్రాసం, పాల ప్యాకేజీ, రవాణా రేట్లు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.
Read More »మంచి అల్పాహారాల్లో పోహ తిన్నారా..?
ఉదయాన్నే తీసుకునే మంచి అల్పాహారాల్లో పోహ కూడా ఒకటి. దీనిని తయారీ చాలా సులువు. చాలా లైట్ ఫుడ్. అటుకులను ముందుగా నీళ్లతో శుభ్రం చేసి పక్కన పెట్టాలి. స్టవ్పై పెనం పెట్టి, నూనె పోసి వేడిచేయాలి. జీలకర్ర, శెనగ పప్పు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు వేసి 5ని.లు కలియబెట్టాలి. ఇప్పుడు అటుకులు వేసి బాగా కలపాలి. చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి మరోసారి …
Read More »శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారికి మాత్రమే ఇది..?
శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు పాటించండి. తరుచూ నీరు తాగుతూ ఉండాలి. గోధుమలు, బియ్యం, పప్పులతో చేసిన ఆహారాలు తినకూడదు. కార్బోహైడ్రేట్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఘాటైన పదార్థాలు తినకండి. గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే మంచిది. జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దేవునిపై శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి.
Read More »సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి
శవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 105, కోల్కతాలో రూ. 108 మేర పెరిగింది. అలాగే 5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.27 ఎగబాకింది. పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ (గృహావసరాల) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
Read More »యూపీ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారా..?
ఉత్తరప్రదేశ్ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి అసెంబ్లీ స్థానం పరిధిలో ప్రచారం ఉండవచ్చు. ఈ సెగ్మెంట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, శరద్ పవార్ వంటి నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు..తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వారితో కలిసి వెళ్తారా? లేక ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొంటారా? అనేది తెలియాల్సి …
Read More »చిరంజీవి అభిమానులకు మహాశివరాత్రి కానుక
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మహాశివరాత్రి కానుక వచ్చేసింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. వైబ్ ఆఫ్ భోళా పేరుతో వచ్చిన ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో చిరు జీపు బంపర్పై కూర్చుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. తమన్నా, కీర్తిసురేష్, రావు రమేశ్, రఘుబాబు, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.
Read More »భీమ్లానాయక్ పై పోలీసు కేసు నమోదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమాలో కుమ్మరుల మనోభావాలను కించపరిచారని ఆరోపిస్తూ ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఎం.పురుషోత్తం గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము ఎంతో పవిత్రంగా భావించే ‘కుమ్మరి చక్రాన్ని’ రానా కాలుతో తన్నే సన్నివేశం కుమ్మరులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే ఆ సన్నివేశం సినిమాలో నుంచి తొలగించాలని పురుషోత్తం డిమాండ్ చేశారు.
Read More »పునీత్ రాజ్ కుమార్ పేరుతో ఉపగ్రహాం
దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ పేరుతో ఓ ఉపగ్రహాన్ని సెప్టెంబర్లో నింగిలోకి పంపించనున్నారు. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ శాటిలైట్ ను రూపొందిస్తున్నారు. ఇస్రో సహకారంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ శాటిలైట్ను కిలోన్నర బరువుతో తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం రూ. 1.90 కోట్లు ఖర్చు కానుందని మంత్రి అశ్వథ్ నారాయణ వెల్లడించారు.
Read More »మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలను మార్చి 7 తేదీ (సోమవారం) నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.కాగా., రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెల్పేందుకు మార్చి 6 వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. మార్చి 7 వ తేదీన ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ …
Read More »ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి అండ -మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు.. ప్రతి ఊరిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి అండ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న నల్లచెరువు, తాళ్ల చెరువు, ఈదుల చెరువు, రాజనగరం చెరువు, శ్రీనివాసపూర్ లక్ష్మీకుంటలను పునర్నిర్మించి పటిష్టం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు …
Read More »