శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు పాటించండి. తరుచూ నీరు తాగుతూ ఉండాలి. గోధుమలు, బియ్యం, పప్పులతో చేసిన ఆహారాలు తినకూడదు. కార్బోహైడ్రేట్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఘాటైన పదార్థాలు తినకండి.
గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే మంచిది. జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దేవునిపై శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి.