ఒకప్పుడు సీమ కథలకు భలే గిరాకీ ఉండేది. అగ్ర హీరోలంతా.. రాయలసీమ ఫ్యాక్షనిజం చుట్టూ కథలు అల్లుకుని అందులో హీరోయిజం చూపించారు. చిరంజీవి సైతం ‘ఇంద్ర’సేనారెడ్డిగా అలరించారు. చాలా కాలం తరవాత.. ఇప్పుడు మళ్లీ సీమ నేపథ్యంలో ఓ కథని ఎంచుకున్నట్టు సమాచారం. చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. డి.వి.వి దానయ్య నిర్మాత. ఈ కథంతా రాయల సీమ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఫ్యాక్షనిజం …
Read More »సూపర్ స్టార్ తో ఐష్
అప్పట్లో విడుదలై ఘన విజయం సాధించి… రికార్డులను సృష్టించిన ‘రోబో’లో జంటగా కన్పించిన రజినీకాంత్, ఐశ్వర్యా రాయ్ మరోసారి కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తలైవా నటించే ‘తలైవర్ 169’ మూవీలో హీరోయిన్ గా నటించాలని ఐశ్ను చిత్రయూనిట్ సంప్రదించిందట. ప్రస్తుతం ‘బీస్ట్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న నెల్సన్.. ఈ మూవీ విడుదల తర్వాత రజినీ మూవీ సెట్లో మెగాఫోన్ పట్టనున్నాడు.
Read More »‘భీమ్లా నాయక్’ గురించి షాకింగ్ న్యూస్
తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ టికెట్లు బుక్ మై షో ద్వారా అమ్మకూడదని నైజాం ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. టికెట్ ధరపై BMS అదనంగా విధించే సర్వీస్, హ్యాండ్లింగ్ ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఛార్జీల నుంచి ప్రతి టికెట్స్ పై రూ.10ని థియేటర్ యాజమాన్యాలకు బుక్ మై షో చెల్లిస్తోంది. దీన్ని రూ.15కు పెంచాలనే డిమాండుతోనే ఈ సంస్థకు బుకింగ్ అనుమతి ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read More »సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో సీనియర్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..సూపర్ స్టార్ మహేశ్ బాబు, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో క్రేజీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ముహూర్తానికి క్లాప్ కొట్టారు మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్. అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఓ శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమెది మహేశ్ పిన్ని పాత్ర అని …
Read More »పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం
దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ (భార్య అశ్విని తండ్రి) రేవనాథ్(78) గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణానంతరం రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్యం బారినపడ్డారు. ఈక్రమంలోనే గుండెపోటుకు గురికాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. పునీత్ కూడా గుండెపోటుతోనే మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త, తండ్రిని కోల్పోయిన అశ్విని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
Read More »మీకు తరుచూ తల తిరుగుతోందా?
మీకు తరుచూ తల తిరుగుతోందా?.. అయితే వీటిని చేయండి.. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఉసిరి పొడిని మిక్స్ చేసి, ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్న వడగట్టుకుని తేనె కలుపుకుని తాగాలి. డా అధికంగా పండ్ల రసాలను తాగాలి. తులసి ఆకులను తినాలి. స్ట్రాబెర్రీలను పెరుగులో మెత్తగా కలుపుకుని తినాలి. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పుచ్చకాయ విత్తనాలు, చిటికెడు గసగసాలు, 5 బాదం, పిడికెడు …
Read More »త్వరలో ప్రకాశ్ పదుకొణె బయోపిక్
త్వరలోనే తన తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్ పదుకొణె బయోపిక్ తీస్తున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రకటించింది. ‘భారత్లో క్రీడల గురించి మాట్లాడుకునేలా చేసిన వ్యక్తుల్లో మా నాన్న ఒకరు. 1981లోనే ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. ఇప్పుడున్నంత అధునాతన సౌకర్యాలు లేకపోయినప్పటికీ తను ఒక్కో మెట్టూ ఎదిగారు.’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
Read More »బోయపాటి శీను కాంబినేషన్లో హీరో రామ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో..ఎనర్జిటిక్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్లో సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. తాను బోయపాటితో సినిమా చేయనున్నట్లు రామ్ ట్వీట్ చేశాడు. ఇది తన 20వ సినిమా అని.. ఎమోషన్స్ పండించడంలో దిట్ట అయిన బోయపాటితో సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు.
Read More »రానున్న ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు
రానున్న ఐదేళ్లలో భారత్లో ఐటీ కంపెనీలు 50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటాయని.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝనన్వాలా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో హైరింగ్ ప్రక్రియ 31 శాతం పెరగనుందన్న ట్యాగ్ సర్వే” ఆధారంగా 50 లక్షల ఐటీ కొలువులు వస్తాయని రాకేష్ అంచనా వేశారు. కొవిడ్ తర్వాత కొత్త ప్రాజెక్టుల్లో ఉద్యోగుల అవసరం పెరగడంతో కంపెనీలు హైరింగ్ ప్రక్రియను వేగవంతం చేశాయి.
Read More »ఆకాశాన్నంటిన బంగారం ధరలు
భారతీయుల్లో బంగారం అంటే ఎంతో ప్రీతి. పుత్తడి కొనుక్కోవాలని.. ఆభరణాలు చేయించుకోవాలని మహిళలు ఆరాటం చూపుతారు. అలాగని బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు.. పెట్టుబడికి మార్గం కూడా.. ధర తగ్గినప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడం శుభ తరుణం అని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. గతేడాది రూ.43 వేల వద్ద ఉన్న తులం బంగారం ఇప్పుడు రూ.50వేలకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడిపోయినా పుత్తడి …
Read More »