తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో..ఎనర్జిటిక్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్లో సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. తాను బోయపాటితో సినిమా చేయనున్నట్లు రామ్ ట్వీట్ చేశాడు. ఇది తన 20వ సినిమా అని.. ఎమోషన్స్ పండించడంలో దిట్ట అయిన బోయపాటితో సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు.