ఒమిక్రాన్ బారినపడినా.. 3-4 రోజుల్లోనే ఎక్కువమంది కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ చాలా మందిలో గొంతుకే పరిమితమవడంతో .. ఆస్పత్రుల్లో చేరికలు స్వల్పంగా ఉంటున్నాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు తగ్గినా.. దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం వంటివి మాత్రం వదలట్లేదు. వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లక్షణాలకు అనుగుణంగా మందులు వాడితే నయమవుతుందంటున్నారు నిపుణులు.
Read More »ఎంపీ అర్వింద్ కు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సవాల్
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ధర్మపురి ఎంపీ అర్వింద్, రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డిని 50 వేల మెజార్టీతో ఓడిస్తానన్న అర్వింద్ వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి స్పందించారు. ‘ఆర్మూర్ లో పోటీ చేస్తానన్న అర్వింద్ సవాల్ స్వీకరిస్తున్నా. ఆయనకు డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తా’ అని …
Read More »మళ్లీ తెరపైకి ఎమ్మెల్యే ఈటల రాజేందర్
దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైని అవమానించే రీతిలో ప్రవర్తించారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. రాజ్ భవన్ కు రాకుండా కేసీఆర్ ప్రగతి భవన్లో వేడుకలు జరుపుకోవడం గవర్నర్ వ్యవస్థను అవమానించడమేనని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన పదవులను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ మంత్రిని కూడా పంపించలేదని విమర్శించారు.
Read More »అక్కడ అమ్మాయికి జన్మనిస్తే రూ.11,116 లు ఆర్థిక సాయం
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మం. మద్దిగట్లకు చెందిన యువకులు ఓ మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఊళ్లో ఆడపిల్ల పుడితే రూ.11,116 చొప్పున ఆర్థికసాయం చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 19 మంది ఆడపిల్లలకు రూ.2,11,204లను వారి తల్లిదండ్రులకు అందజేశామని చెప్పారు. దీనికి ‘అభయహస్తం’ అనే పేరు పెట్టారు. ఇందుకోసం గ్రామ యువకులంతా కమిటీగా ఏర్పడి డబ్బు జమచేసుకుంటున్నారు. కొందరు దాతలు కూడా ఈ మంచిపనిలో భాగమవుతున్నారు.
Read More »కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు పంపిణీలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం
కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు పంపిణీలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం, దక్షిణ భారత దేశంలో ద్వితీయ, జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలువడం గర్వకారణమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు పేర్కొన్నారు. సీఎం ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని, ఈ విజయాన్ని కేసీఆర్‌కే అంకితం చేస్తున్నామని ప్రకటించారు. వ్యాక్సినేషన్‌లో జిల్లా సాధించిన విజయానికి గుర్తుగా బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి …
Read More »తెలంగాణలో డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు
తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్ ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరుపాలని సీఎం నిర్ణయించారు. సీఎం అధ్యక్షతన జరుగనున్న ఈ సదస్సు లో …
Read More »శ్రీకాంత్ కు కరోనా పాజిటీవ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో శతాధిక చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో శ్రీకాంత్. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్‌గానూ, విలన్ గానూ సత్తాచాటుకుంటున్నారు. ఇటీవలే ఓ సీనియర్ హీరో సినిమాలో విలన్‌గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీకాంత్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఈ రోజు (బుధవారం) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘మిత్రులారా.. అవసరమైన జాగ్రత్తలు …
Read More »ప్రగతి భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ లో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాల్గొన్నారు. సీఎం గారు జాతీయ జెండా ను ఆవిష్కరించగా, మంత్రి ఆ జాతీయ జెండాకు వందనం …
Read More »సైనిక అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు
సైనిక అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు త్రివిధ దళాధిపతులు సాదరంగా స్వాగతం పలికారు.అనంతరం సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి యుద్ధవీరులకు వందనం చేశారు. త్రివిధ దళాధిపతులు సైతం అమరవీరులకు నివాళులర్పించారు.తెలంగాణ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై, తాత్కాలిక …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యంత గొప్ప లిఖిత రాజ్యాంగం ఉన్న భారతదేశం సగర్వంగా జరుపుకుంటున్న 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలే ప్రభువులుగా పాలించుకునే గొప్ప లక్షణం ఈ గణతంత్రమని…అందుకే ఈ రోజును మనమంతా జాతీయ పండుగగా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం …
Read More »