తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి శంకర్రావు కోర్టులోనే కళ్లు తిరిగి పడిపోయారు. 2కేసుల్లో ఆయన దోషిగా తేలారు. భూ వివాదంలో బెదిరింపు, మహిళను దూషించారన్న కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది. అంతేకాదు.. రూ.3,500 జరిమానా విధించింది. దీంతో శంకర్రావు అక్కడికక్కడే పడిపోయారు. షాద్నగర్ నమోదైన మరో కేసును కోర్టు కొట్టివేసింది.
Read More »RRR విడుదల జాప్యంపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో RRR వాయిదాపై హీరో రామ్ చరణ్ తొలిసారి స్పందించాడు. రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఇవెంట్లో మాట్లాడుతూ.. ‘సినిమా కోసం 3 ఏళ్లు కష్టపడ్డాం. సంక్రాంతికి RRR మూవీ రిలీజ్ కాకపోయినా …
Read More »ఏపీలో కొత్తగా 3,205కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 3,205కరోనా కేసులు వెలుగు చూశాయి. 2 రోజుల్లోనే 2వేలకు పైగా కేసులు పెరిగాయి. నిన్న 1,831 కేసులు వచ్చాయి. కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 10,119 యాక్టివ్ కేసులున్నాయి. విశాఖలో 695, చిత్తూరు 607, తూ.గో 274, శ్రీకాకుళం 268, గుంటూరు 224, కృష్ణా 217, విజయనగరం 212, నెల్లూరు జిల్లాలో 203, అనంతపురం జిల్లాలో 160 మంది వైరస్ బారినపడ్డారు. 281 మంది …
Read More »ఉద్యోగులకు మోదీ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం
దేశంలోని ఉద్యోగులకు మోదీ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోబోతుంది. కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచనుంది. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కౌ50వేలుగా ఉంది. దీన్ని 30-35 శాతానికి పెంచనున్నారు. వచ్చే బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. అయితే ఉద్యోగులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకొని ఉంటే.. వారికి స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ లభించదు. పాత పన్ను విధానంలో ఈ ప్రయోజనం ఉంటుంది.
Read More »కరోనా క్వారంటైన్ నిబంధనల్లో మార్పు
కరోనా రోగుల కాంటాక్టులకు వారం రోజులే క్వారంటైన్ ఉంటుందని కేంద్రం తెలిపింది. అలాగే స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులు సైతం 7 రోజుల్లోనే డిశ్చార్జ్ కావొచ్చని పేర్కొంది. కాగా దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నట్లు వెల్లడించింది. బెంగాల్(32%), ఢిల్లీ(23%), మహారాష్ట్ర (22%)లో పాజిటివిటీ రేటు అధికంగా ఉందని వివరించింది.
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో.. ‘పెంచిన ఎరువుల ధరలను కేంద్రం తగ్గించాలని కోట్ల మంది రైతుల తరఫున కోరుతున్నా. ఇప్పటికే అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు.. ధాన్యం కొనుగోళ్లు ఆపారు. వ్యవసాయ ఖర్చును విపరీతంగా పెంచారు. రైతులకు విద్యుత్ మీటర్లు పెట్టి వారి ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Read More »బాలయ్య అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..యువరత్న బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీకాంత్ విలన్ గా వచ్చిన చిత్రం అఖండ. బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పాడు. అందుకు కావాల్సిన లీడ్ సినిమాలో చూపించానని, సీక్వెల్ ఎప్పుడుంటుందనేది తర్వాత చెబుతామని తెలిపాడు. అఖండ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బోయపాటి.. ఈ సినిమా ద్వారా తాను తెలుగు రాష్ట్రాల్లోని …
Read More »మోదీకి మంత్రి కేటీఆర్ షాకింగ్ ట్వీట్
భారత ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువత, విద్యార్థుల తరపున మీరు త్వరగా సవరణలు చేయవలసిందిగా కోరుతున్నాను. గత 7 సంవత్సరాలలో రాష్ట్రం నుంచి అనేక అభ్యర్థనలు ఉన్నప్పటికీ, NDA ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను కూడా మంజూరు చేయలేదు’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దేశంలో మంజూరైన విద్యాసంస్థల వివరాలను కేటీఆర్ పంచుకున్నారు.
Read More »కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు
సౌతాఫ్రికా ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో 100 టెస్టు క్యాచ్లు అందుకొని కొత్త మైలురాయిని అధిగమించాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టుల్లో అజారుద్దిన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. నాలుగో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.
Read More »210పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
కేప్టాన్ లో జరుగుతున్న నిర్ణయాత్మక 3వ టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ని భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో సఫారీ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ 210పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో పీటర్సన్-72 రాణించాడు. మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో బుమ్రా-5, ఉమేశ్ యాదవ్-2, షమీ-2, శార్దూల్ ఠాకూర్-1 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ భారత్ 223రన్స్ చేసింది. 13పరుగులు ముందంజలో ఉంది.
Read More »