తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..యువరత్న బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీకాంత్ విలన్ గా వచ్చిన చిత్రం అఖండ.
బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పాడు. అందుకు కావాల్సిన లీడ్ సినిమాలో చూపించానని, సీక్వెల్ ఎప్పుడుంటుందనేది తర్వాత చెబుతామని తెలిపాడు.
అఖండ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బోయపాటి.. ఈ సినిమా ద్వారా తాను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటికి పరిచయం అయ్యానని అన్నాడు. బాలకృష్ణ తనమీద పెట్టుకున్న నమ్మకంతోనే ఈ సినిమా తెరకెక్కించానని పేర్కొన్నాడు.