తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 83,153 టెస్టులు చేశారు. 1,920 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే 100కేసులు పెరిగాయి. ఇక మహమ్మారితో ఇద్దరు మరణించారు. మరోవైపు కరోనా నుంచి 417 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,496 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
Read More »సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. దేశంలో లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలని కేసీఆర్.. లాలూతో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలని లాలూ కోరినట్లు సమాచారం. కేసీఆర్ పాలనా అనుభవం దేశానికి అవసరముందని లాలూ అన్నట్లు తెలిసింది.
Read More »మరోసారి అందాలను ఆరబోయడానికి సిద్ధమైన మిల్క్ బ్యూటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ..మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి ఐటమ్ సాంగ్తో హీట్ పెంచేందుకు సిద్ధమైందట. గతంలో ‘స్వింగ్ జరా’ అంటూ ఆమె కుర్రకారుతో స్టెప్పులేయించింది. తాజాగా వరుణ్ తేజ్ చిత్రం ‘గని’లో ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ బర్త్ డే సందర్భంగా రేపు ఉ.11.08గంటలకు ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే …
Read More »దేశంలో కరోనా విలయతాండవం
దేశంలో ప్రస్తుతం కరోనా భీభత్సం సృష్టిస్తున్నది.పలు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈక్రమంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కొత్తగా 21,259 కోవిడ్ కేసులు పశ్చిమబెంగాల్లో కొత్తగా 21,098 మందికి కోవిడ్ తమిళనాడులో కొత్తగా 15,379 కేసులు నమోదు కర్ణాటకలో కొత్తగా 14,473 మందికి కరోనా కేరళలో కొత్తగా 9,066 కొవిడ్ కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ …
Read More »పొత్తులపై పవన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రకరకాల పార్టీలు మనతో పొత్తు కోరుకోవచ్చు. అయితే, జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. పొత్తుల కంటే ముందు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాం. ఇతర పార్టీలతో పొత్తుపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని పవన్ అన్నారు. ‘వన్ సైడ్ లవ్’ అని జనసేనతో పొత్తును ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు …
Read More »ఉస్మానియా వైద్యులకు మంత్రి హరీష్ రావు అభినందనలు..
ఉస్మానియా వైద్యులను ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అభినందించారు. క్యాథ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందిస్తున్న సేవల పట్ల, ఆర్థో శస్త్ర చికిత్సల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉస్మానియా సూపరింటెండ్ డాక్టర్ నాగేందర్, కార్డియాలజీ విభాగం హెడ్ డాక్టర్ ఇమాముద్దిన్, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగం హెడ్ జి రమేష్ సోమవారం అరణ్య భవన్ లో మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా ఉస్మానియాలో …
Read More »భవిష్యత్ కార్యాచరణపై భజ్జీ క్లారిటీ
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన భవిష్యత్ కార్యాచరణపై స్పందించాడు. తనకు రాజకీయాల గురించి తెలియదని, క్రికెట్తో సంబంధమున్న వ్యవహారాల్లోనే కొనసాగుతానని తెలిపాడు. అయితే కామెంటేటర్గా మారడమా.. మెంటార్గా వ్యవహరించడమా అనేది త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నాడు. కాగా, 2016లో భారత్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భజ్జీకి తరువాత జట్టులో చోటు దక్కలేదు.
Read More »సరికొత్తగా సమంత
వరుస సినిమాల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న సమంత మరో నెగెటివ్ రోల్లో అభిమానులను అలరించనుందట.’పుష్ప’లో ఐటం సాంగ్ చేసి ఫ్యాన్స్ను ఉర్రూతలూగించగా.. హాలీవుడ్ మూవీ ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’లో బై-సెక్సువల్ పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇక తాజాగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, నయనతార జంటగా తమిళ్ తెరకెక్కుతున్న ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ సినిమాలో సామ్ నెగెటివ్ షేడ్స్లో నటించనుందట.
Read More »హీరోగా సిద్ శ్రీరామ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేని మెస్మరైజ్ వాయిస్ తో ఎంతో మందిని మంత్రముగ్ధుల్ని చేసిన సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ త్వరలోనే హీరోగా తెరపై కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘కడలి’ మూవీ ద్వారా సిద్ గాయకుడిగా పరిచయం కాగా.. ఇప్పుడు ఆయన చిత్రంతోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయిందని, హీరోగా నటించేందుకు సిద్ కూడా …
Read More »అమెరికాలో 6కోట్లకు చేరుకున్న కరోనా కేసులు
అమెరికాలో జనవరి, 2020 నుంచి ఇప్పటివరకు 60 మిలియన్ల (6కోట్లు) మందికి పైగా కరోనా బారిన పడ్డారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇందులో 8,37,594 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ప్రపంచంలో నమోదైన కరోనా కేసుల్లో 20 శాతం, మరణాల్లో 15 శాతం ఒక్క అమెరికాలోనే ఉన్నాయని పేర్కొంది. నవంబర్ 9, 2020 నాటికి అమెరికాలో కోటి కేసులు రాగా జనవరి 1, 2021కి అవి 2 కోట్లకు …
Read More »