దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,79,723 కరోనా కేసులు, 146 మరణాలు నమోదయ్యాయి. నిన్నటి (1.59 లక్షలు)తో పోలిస్తే కేసులు పెరగ్గా, మరణాలు 327 నుంచి 146కు తగ్గాయి. 46,569 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,23,619 ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 29,60,975 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఒమిక్రాన్ కేసులు 4033కు చేరాయి.
Read More »తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులతో పోలిస్తే కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,673 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. నిన్న 2,606, మొన్న 2,295 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా గత 24 గంటల్లో ఒకరు మృతి చెందగా మరో 330 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,522 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ …
Read More »GHMCలో కొత్తగా 1165 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో తాజాగా మరో 1165 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,54,287 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. ‘ఒమిక్రాన్’ వేరియంట్ నేపథ్యంలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »మహారాష్ట్రలో కరోనా భీభత్సం
మహారాష్ట్రలో గత 24గంటల్లో కొత్తగా 44,388 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 19,474 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. మహమ్మారి వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 2.02లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »బండ్ల గణేష్ కు కరోనా
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు చెప్పాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నాడు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదనితెలిపాడు. తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కాగా గతంలో కూడా బండ్ల గణేష్కు కరోనా వచ్చి కోలుకున్నాడు.
Read More »రష్మిక మంధాన చాలా Costly గురు
ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప పార్ట్-1తో సక్సెస్ అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక.. రెండో పార్ట్ కోసం భారీగా రెమ్యునరేషన్ పెంచేసిందని టాలీవుడ్ టాక్. పార్ట్-1 కోసం రూ.2 కోట్లు తీసుకున్న ఈ అమ్మడు.. రెండో భాగం కోసం రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. అందుకు ప్రొడ్యూసర్లు సైతం ఓకే చెప్పారని సమాచారం. కాగా పుష్ప పార్ట్-2 షూటింగ్ ఈ …
Read More »టామ్ లాథమ్ డబుల్ సెంచరీ(252)
బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ డబుల్ సెంచరీ(252)తో చెలరేగాడు. లాథమ్తో పాటు కాన్వే సెంచరీ(109)తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 521/6 వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా బౌలర్లలో షరిఫుల్ ఇస్లాం 2, ఇబాదత్ హొస్సేన్ 2, మొమినుల్ ఒక వికెట్ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Read More »మామిడి పండ్లతో వైన్
సాధారణంగా ద్రాక్షతో వైన్ తయారుచేస్తారు. మరి ద్రాక్ష ఉత్పత్తి సరిగా లేకపోతే వేరే పండ్లతో వైన్ తయారుచేయలేమా? అనే ఆలోచన యూపీ ఎక్సైజ్ శాఖకు వచ్చింది. వినూత్నంగా ఆలోచించి.. తమకు అందుబాటులో ఉన్న మామిడి పండ్లతో వైన్ తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విధానాన్ని సవరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆమోదం పొందగానే మ్యాంగో వైన్ తయారీ ప్రారంభం కానుంది.
Read More »మెంతులతో ఎంతో మేలు..?
మెంతులతో ఎంతో మేలు ఉందంటున్నరు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తాయి అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి రాత్రి మెంతులు నానబెట్టిన నీటిని పరగడుపున తాగితే అజీర్తి సమస్య తగ్గుతుంది చెంచా మెంతులను రోజూ ఉదయం, రాత్రి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, విరోచనాలు తగ్గుతాయి వీటిలోని ఫైబర్ కడుపు నిండిన భావన కల్గిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకోవడంతో ఊబకాయ సమస్య తగ్గుతుంది
Read More »టెస్టు క్రికెట్ కి ధనుష్క గుణతిలక వీడ్కోలు
శ్రీలంక కు చెందిన క్రికెటర్ ధనుష్క గుణతిలక టెస్టు క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ఇప్పటివరకు మొత్తం 8 టెస్టులు 8 ఆడిన అతడు.. 299 రన్స్ చేశాడు. వన్డేలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 30 ఏళ్ల గుణతిలక వెల్లడించాడు. అయితే గుణతిలకతోపాటు మరో ఇద్దరిపై శ్రీలంక బోర్డు విధించిన ఏడాది నిషేధం ఎత్తివేసిన రోజే అతడు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఇటీవలే భానుక రాజపక్సె …
Read More »