కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఐసోలేషన్లోకి వెళ్లారు. తన కుటుంబంలోని ఓ సభ్యుడితో పాటు ఆమె సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వాళ్లతో కాంటాక్ట్ లో ఉన్న కారణంగా ప్రియాంక స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా.. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
Read More »దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని కొవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ డా. ఎన్కే అరోరా తెలిపారు. ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలో నమోదవుతున్న కేసుల్లో 75 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్వే అని చెప్పారు. గత ఏడాది DEC తొలి వారంలో మొదటి ఒక్రాన్ కేసును గుర్తించగా 2 వారాల్లోనే ఈ వేరియంట్ దేశమంతటా వ్యాపించిందని తెలిపారు. దీనిని బట్టి దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని చెప్పవచ్చన్నారు.
Read More »తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ..?విధిస్తారా..?
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు ప్రసారమవుతున్నాయి.ఈ వార్తలపై సీఎం కేసీఆర్ క్లారిటీచ్చారు.లాక్డౌన్ ప్రస్తుతం అవసరం లేదని అధికారులు నివేదిక ఇచ్చినట్లు సీఎం కేసీఆర్ అన్నారు. వైద్యారోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. ఒమిక్రాన్ పట్ల భయం వద్దని, అదే సమయంలో అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. అందరూ మాస్కు ధరించాలన్నారు. కాగా, విద్యాసంస్థలకు ఈనెల 8 నుంచి 16 వరకు …
Read More »ఏపీలో కొత్తగా 122 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. తాజాగా 103 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,278గా ఉంది.మొత్తం కేసులు – 20,77,608 .వీటిలో కోలుకున్న వారి సంఖ్య 20,61,832. మరణించిన వారి సంఖ్య – 14,498గా ఉంది.
Read More »తెలంగాణలో ఈనెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణలో ఈనెల 8 నుంచి 16 వరకు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెలవుల్లో విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని సూచించింది.
Read More »హైదరాబాద్ నగరంలో కొత్తగా 294 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 294 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,47,235 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో ‘ఒమిక్రాన్’ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. టీనేజర్స్ ప్రతీ ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
Read More »వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
తెలంగాణలోకరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పడకలు, ఆక్సిజన్, మందులు, పరీక్ష కిట్లు అవసరం మేరకు సమకూర్చుకోవాలన్నారు. అన్ని దవాఖానాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, ఖాళీలు ఉంటే 15 రోజుల్లోగా భర్తీ చేసుకునేలా విధివిధానాలు రూపొందించాలని కేసీఆర్ సూచించారు.
Read More »బరువు తగ్గడానికి అది కూడా చేయాలా..?
చాలామంది బరువు తగ్గడానికి చపాతీలు తింటుంటారు. అయితే డైలీ ఇవి తింటే బోర్ కొడుతుంది. అందుకే వాటి ప్లేస్లో సజ్జ రొట్టెలు చేర్చండి. వీటిలో ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. అలాగే ఇది గ్లూటెన్ రహిత ఆహారం. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. అలాగే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలు రావు. సజ్జ రొట్టె ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు …
Read More »ఇమ్యూనిటీ పెరగాలంటే..?
శరీరంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఆహారంతో పాటు జ్యూస్లు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, టొమాటో, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, యాపిల్, బీట్రూట్, క్యారట్ జ్యూస్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ, సి, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్.. ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గును తగ్గించడంలో ఉపయోగపడతాయి.
Read More »తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. అలనాటి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూశారు. 86ఏళ్ల PC రెడ్డి కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్నారు. నేడు చెన్నైలో తుదిశ్వాస విడిచిన ఆయన.. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. దివంగత సీనియర్ నటులు ఎన్టీఆర్, ANR లతో పాటు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి లెజండరీ హీరోలతో సినిమాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలతో ఎక్కువుగా …
Read More »