నోటి దుర్వాసనకు చెక్ పెట్టండిలా! మీ దంతాలను క్రమం తప్పకుండా కనీసం 3 నిమిషాలు బ్రష్ చేయండి ‘సున్నితంగా, ఒత్తిడి పడకుండా నోట్లో రౌండ్ కదిలిస్తూ బ్రష్ చేయాలి ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత మీ బ్రషు మార్చండి భోజనం చేసిన తర్వాత నీరు పుక్కిలించి ఉమ్మండి బాక్టీరియాను తొలగించడానికి నాణ్యత ఉండే టంగ్ క్లీనర్ వాడండి
Read More »ఏపీ ప్రభుత్వాన్ని కరోనాతో పోల్చిన ఆర్జీవీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కరోనాకు పెద్దగా తేడా లేదని డైరెక్టర్ RGV సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఆయన మాట్లాడుతూ.. ‘థియేటర్లు, టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సినీ పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమీ లేదు. అసలు వారు మాట్లాడాల్సిన పని లేదు. ఇండస్ట్రీ పెద్దలంటే బాగా సెటిల్ అయినవారు. అలాంటి వారు ప్రభుత్వంతో గొడవ ఎందుకు పెట్టుకుంటారు, కావ్గా ఉంటారు’ అని చెప్పాడు.
Read More »మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ హయాంలో 2004లో మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్.. జహీరాబాద్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2016లో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు.
Read More »నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ -CM KCR
తెలంగాణలోని నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 31న రూ.110 కోట్లతో చేపట్టే ఐటీ హబు శంకుస్థాపన చేస్తామన్న సీఎం కేసీఆర్ నగరంలో 2 ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయాలన్నారు. రూ.36 కోట్లతో కొత్త డిగ్రీ కాలేజీ భవనం నిర్మించాలన్న సీఎం.. పట్టణాన్ని సుందరంగా మార్చాలన్నారు. కాగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ నిన్న బుధవారం …
Read More »అమూల్ సంస్థ రావడం గర్వకారణం -మంత్రి KTR
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అమూల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా బేకరీ తయారీ ప్లాంటును అమూల్ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. ప్లాంటు నిర్మాణానికి మొదటి దశలో రూ. 300 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్న అమూల్.. రెండో దశలో మరో రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. కాగా రాష్ట్రానికి అమూల్ సంస్థ రావడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు …
Read More »భారత్ 174 రన్స్ కి ఆలౌట్
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు 2వ ఇన్నింగ్సులో భారత్ 174 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. పంత్ (34), KL రాహుల్(23), రహానే (18) తప్ప మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడ, మార్కో చెరు 4 వికెట్లు తీయగా.. ఎంగిడికి 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి భారత్ 304 రన్స్ ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్లో గెలవాలంటే సౌతాఫ్రికా 305 …
Read More »తెలంగాణలో కొత్తగా 235 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,023 టెస్టులు చేయగా.. 235 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,307కు చేరాయి.. గడిచిన 24 గంటల్లో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 346 మందికి టెస్టులు చేయగా.. 10 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.
Read More »అమెరికాలో కరోనా కలవరం.. ఒకేరోజు 3లక్షల కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. అమెరికాలో గత 24 గంటల్లో 3లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 18 వందల మందికి పైగా మహమ్మారి వల్ల చనిపోయారు. ఫ్రాన్స్లోనూ కొవిడ్ విజృంభిస్తోంది. అక్కడ నిన్న ఒక రోజే 2లక్షల మందికి కరోనా నిర్ధారణ అయింది. పోర్చుగల్లో 26 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. పొలాండ్లో 15వేలు, రష్యాలో 21 వేల కేసులు నమోదయ్యాయి.
Read More »మహారాష్ట్రలో ఒమిక్రాన్ కల్లోలం
మహారాష్ట్రలో ఒమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. గత 24గంటల్లో కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 252కు పెరిగింది. వీటిలో ఒక ముంబైలోనే 137 కేసులు ఉన్నాయి. మరోవైపు గత 24గంటల్లో కొత్తగా 3,900 కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ వల్ల 20 మంది చనిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం 14,065 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »ముంబైలో కరోనా అలజడి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా అలజడి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ముంబైలో 2,510 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ముంబైలో 1,377 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా నిన్న మహారాష్ట్ర వ్యాప్తంగా 2,172 కేసులు రాగా.. ఇవాళ ఒక్క ముంబై నగరంలోనే ఇన్ని కేసులు నమోదవ్వడం గమనార్హం. కాగా మహారాష్ట్రలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది.
Read More »