బుల్లితెర మోస్ట్ సీనియర్ హాట్ యాంకర్ ఉదయభాను.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరను ఏలిన మహారాణి ఈమె. ఇప్పుడు మనం సుమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాము కానీ ఆమె కంటే ముందు స్టార్ యాంకర్ అంటే ఉదయభాను మాత్రమే. బుల్లితెరకు గ్లామర్ షో అద్దిన యాంకర్ ఈమె. ఒకప్పుడు కేవలం ఈమె కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ చూసేవాళ్లు ఆడియన్స్. కేవలం యాంకర్‌గానే కాకుండా …
Read More »Power Star అభిమానులకు Good News
టాలీవుడ్ సీనియర్ నటుడు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో గోపాల గోపాల సినిమాలో కృష్ణుడిగా నటించి అలరించిన పవన్.. మరోసారి వెండితెరపై దేవుడిగా కనువిందు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళ దర్శకుడు సముద్రఖని వినోధాయ సిత్తం అనే సినిమాను డైరెక్ట్ చేయగా.. తెలుగు రీమేక్లో ఈ మూవీలో దేవుడి పాత్రను పవన్తో చేయించాలని భావిస్తున్నాడట. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
Read More »రాజన్న సిరిసిల్ల లో ఒమిక్రాన్ కలవరం
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ (మ) గూడెంలో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా.. అతని భార్య, తల్లికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో గ్రామంలో లాక్ డౌన్ విధించనున్నట్లు పంచాయతీ పాలకవర్గం తెలిపింది. గూడెంలో ఇప్పటికే షాపులు, హోటళ్లు, బడులను మూసివేయగా.. రానున్న 10 రోజుల పాటు గ్రామంలోకి ఎవరూ రాకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్లు స్థానిక పాలకవర్గం తెలిపింది.
Read More »దేశంలో కొత్తగా 7,495 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 7,495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 6,960 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 2020 మార్చి తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 78,291 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 98.40 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 139.70 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ జరిగింది. …
Read More »రోగనిరోధకశక్తిని ఇలా పెంచుకోండి
రోజూ ఉదయాన్నే గ్రీన్ టీ తాగాలి రోజూ తేనె తాగడం అలవాటు చేసుకోవాలి విటమిన్ సి ఉన్న పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి జీడిపప్పు, బాదం, వేరుసెనగ, ఆవాలు, వెల్లుల్లి, నువ్వులు తినాలి చిలగడదుంపలు తినడం వల్ల దానిలో ఉండే.. బీటాకెరోటిన్ అనే పదార్థం ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతూ ఇమ్యూనిటీని పెంచుతుంది పుట్టగొడుగులను తీసుకోవాలి
Read More »డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి
డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని, కానీ ఇది దాని కంటే వేగంగా వ్యాపించగలదని ఒమిక్రాన్ను తొలిసారి గుర్తించిన సౌతాఫ్రికా వైద్యురాలు ఏంజెలిక్ కోట్టీ అన్నారు. తాను ఇప్పటివరకు ఒమిక్రాన్ సోకిన వందమందికి చికిత్స చేశానని, సౌతాఫ్రికాలో తీవ్రమైన కేసులు లేవన్నారు. కాగా, కోట్టీ ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించి ఆ దేశ వైద్యారోగ్య శాఖను వెంటనే అప్రమత్తం చేశారు.
Read More »గుజరాత్ లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను ఈ నెల 31 వరకు పొడిగించింది. ఆ రాష్ట్రంలోని 8 నగరాల్లో రాత్రి పూట నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని గుజరాత్ సర్కారు పేర్కొంది. రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా గుజరాత్లో తాజాగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో అక్కడ మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య …
Read More »తెలంగాణలో కొత్తగా 156 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 207 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా నిన్న, ఇవాళ ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వైద్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 20 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
Read More »నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కారు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సర్కారు సిద్ధమైంది. అన్ని శాఖల్లో కలిపి 86 వేల ఖాళీలు ఉన్నట్లు తేలింది. వీటిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోనూ ఏర్పడిన 55వేలకు పైగా ఉద్యోగాలను వరుస నోటిఫికేషన్లలో భర్తీ చేయాలనుకుంటోంది. ఇక నుంచి ఖాళీలు ఏర్పడ్డ 6 నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేసేలా ప్లాన్ చేస్తోంది.కాగా హోంశాఖలో 21507, విద్యాశాఖలో 22వేలు, వైద్యశాఖలో 10,048, …
Read More »జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వీలుగా జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన దేశాయ్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదించింది. జమ్మూలో 6, కశ్మీర్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే ఈ ప్రతిపాదనను నేషనల్ కాన్ఫరెన్స్ సహా ఇతర పార్టీలు, బీజేపీ మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం కశ్మీర్లో 46, జమ్మూలో 37 అసెంబ్లీ స్థానాలున్నాయి.
Read More »