Home / rameshbabu (page 534)

rameshbabu

నాదల్ కు కరోనా

స్టార్ టెన్నిస్ ప్లేయర్ నాదల్ కు కరోనా సోకింది. స్పెయిన్లో చేసిన పరీక్షల్లో నాదల్ కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా అబుదాబీలో ఈవెంట్ ముగించుకుని గతవారమే నాదల్ స్పెయిన్ వచ్చాడు.

Read More »

ఢిల్లీ రాష్ట్రంలో ఉచిత రేషన్ పథకం పెంపు

ఢిల్లీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో ఉచిత రేషన్ పథకాన్ని మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజీవాల్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోసుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 26 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Read More »

విద్యాభ్యాసమే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అమ్మాయిలకు తొలిమెట్టు

అమ్మాయిల విద్యాభ్యాసం స‌మాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు మొద‌టిమెట్టు అని స‌మాచార పౌర సంబంధాల శాఖ స‌హాయ సంచాల‌కులు జి. లక్ష్మ‌ణ్ కుమార్‌ అన్నారు. `ఏక్ భార‌త్ – శ్రేష్ట భార‌త్ ` కార్య‌క్ర‌మం ద్వారా భార‌త దేశ విశిష్ట‌త‌లు ప్ర‌జ‌లంద‌రూ విపులంగా తెలుసుకుంటున్నార‌ని ఆయ‌న వివ‌రించారు. కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌కు చెందిన క్షేత్ర ప్ర‌చార విభాగం వ‌రంగ‌ల్ యూనిట్ ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలోని పింగిలి మ‌హిళా …

Read More »

యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం

యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 82/4తో ఐదోరోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ డ్రా కోసం తీవ్రంగా పోరాడింది. బట్లర్ 207 బంతులాడి కేవలం 26 రన్స్ చేసి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అయితే చివరికి అతడు కూడా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఓటమి ఖరారైంది. దీంతో 5 టెస్టుల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో …

Read More »

పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార వైసీపీకి చెందిన నేత, మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ రాజకీయ అజ్ఞాని అని నాని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయం తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమని.. అధికార వైసీపీకి చెందిన  ఎంపీలు ప్లకార్డులు పట్టుకున్నంత మాత్రాన ప్రైవేటీకరణ ఆపేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీకి జనసేన అధినేత పవన్ సలహాలు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. వెళ్లి బీజేపీకి   సలహాలు ఇచ్చుకోవాలని …

Read More »

Power Star అభిమానులకు Bad News

వచ్చే సంక్రాంతి బరి నుంచి పవర్ స్టార్ ..స్టార్ హీరో పవన్ కళ్యాణ్-రానాల కాంబోలో వస్తున్న  ‘భీమ్లానాయక్’ సినిమా  తప్పుకుంది. ఈసారి పండక్కి పాన్-ఇండియా సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రిలీజ్ అవనుండటంతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. థియేటర్ల ఇబ్బందులు, ఇతర సమస్యలను వివరించి నిర్మాతల మధ్య సయోధ్య కుదిర్చాడు. దీంతో భీమ్లానాయక్ ఫిబ్రవరి 25న శివరాత్రికి విడుదల కానుంది. ఇక, ఈ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మాత్రమే పెద్ద …

Read More »

ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

దేశంలోనే తొలి ఐఏఎంసీ హైద‌రాబాద్‌లో ఏర్పాటైంది. నానక్‌రామ్‌గూడ‌లోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌లో ఏర్పాటు చేసిన‌ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే చంద్ర‌శేఖర్ రావు క‌లిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్‌సైట్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా ఐఏఎంసీ కేంద్రాన్నిసీజేఐకు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం తాత్కాలిక భ‌వ‌నంలో ఐఏఎంసీ ఏర్పాటు …

Read More »

సీఎం జగన్ రెడ్డికి సబ్జెక్టు లేదు- Nara Lokesh

ఏ మాత్రం తనకు సబ్జెక్ట్‌ లేక అవగాహన లేమితో సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానులని ప్రకటించారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించే రోజు దగ్గరిలోనే ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా రైతుల సభకు వెళ్లకుండా ప్రజలను అడ్డుకోవడం, ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయడం నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని రైతుల బహిరంగ సభ …

Read More »

‘అలాంటివారివల్లే ప్రపంచం ఇంత అందంగా ఉంటోంది

ఒకప్పటి Team India  బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తన సహృదయతను మరోసారి చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన తన స్నేహితురాలిని కాపాడిన ట్రాఫిక్‌ పోలీసును వ్యక్తిగతంగా కలిసి థ్యాంక్స్‌ చెప్పాడు. ఇటీవల సచిన్‌ ఫ్రెండ్‌ ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసు వెంటనే స్పందించి ఆమెను ఆటోలో జాగ్రత్తగా ఆసుపత్రికి చేర్చాడు. దాంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది. …

Read More »

Music Director DSP కి ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

Tollywood Top Music Director   దేవీశ్రీ ప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. హిందూ సమాజం ఇచ్చే గౌరవాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.  ‘పుష్ప’ సినిమా ఐటమ్ సాంగ్‌లో పదాలను.. దేవుడి శ్లోకాలతో పోల్చటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. దేవీశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. దేవీశ్రీ హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat