Breaking News
Home / ANDHRAPRADESH / సీఎం జగన్ రెడ్డికి సబ్జెక్టు లేదు- Nara Lokesh

సీఎం జగన్ రెడ్డికి సబ్జెక్టు లేదు- Nara Lokesh

ఏ మాత్రం తనకు సబ్జెక్ట్‌ లేక అవగాహన లేమితో సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానులని ప్రకటించారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించే రోజు దగ్గరిలోనే ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

కోర్టు అనుమతి ఇచ్చినా రైతుల సభకు వెళ్లకుండా ప్రజలను అడ్డుకోవడం, ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయడం నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని రైతుల బహిరంగ సభ విజయవంతమైందన్నారు.

మరోవైపు సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ యల్లపు సంతోశ్‌ నిండు గర్భిణిగా ఉన్న తన భార్యను ఆస్పత్రిలో డెలివరీ కోసం చేర్చగా… ఆయనను ఉగ్రవాదిలాగా సీఐడీ పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కనీస నోటీసు ఇవ్వకుండా వైసీపీ పెద్దల కళ్లలో ఆనందం చూసేందుకు ప్రయత్నిస్తున్న సీఐడీ తీరు చాలా దారుణమన్నారు. సంతోశ్‌, ఆయన భార్యకు ఏం జరిగినా పూర్తిగా సీఐడీదే బాధ్యతన్నారు.  

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri