తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం శుక్రవారం తెలంగాణభవన్‌లో జరుగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనున్న ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి జిల్లా కమిటీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా …
Read More »రాష్ట్ర నిధులతోనే కాళేశ్వరం..
ప్రతిష్ఠాత్మక బహుళదశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తన సొంత వనరులతోనే నిర్మిస్తున్నదని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లోక్‌సభలో వెల్లడించారు.నిర్మాణ పనులకు ఆన్‌లైన్ టెండర్ విధానాన్ని అనుసరించిందని చెప్పారు. గురువారం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాళేశ్వరానికి అనుమతులున్నాయా? ఎంత ఖర్చు చేశారు? ప్రాజె క్టు ద్వారా కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై అడిగిన ప్రశ్నకు షెకావత్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జల్‌శక్తి శాఖలోని సాగునీరు, …
Read More »వన్డే కెప్టెన్సీ తొలగింపుపై సునీల్ గవాస్కర్ Hot Comments
టీమిండియా క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీ తొలగింపుపై విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోహ్లి చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు. ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. వివరించాలి. అలాగే, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కూడా కోహ్లిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెప్పాలి’ అని అన్నాడు.
Read More »వన్డే కెప్టెన్సీ మార్పుపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లికి బీసీసీఐ చెప్పాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ‘కోహ్లిలా సెలెక్టర్లు క్రికెట్ ఆడకపోవచ్చు. కానీ కెప్టెన్ను నిర్ణయించే హక్కు వారికుంటుంది. తమ నిర్ణయం గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. ఇది కోహ్లికే కాదు ప్రతి ఆటగాడికి వర్తిస్తుంది. ఈ వివాదం కోహ్లి టెస్ట్ కెప్టెన్సీపై ప్రభావం చూపదని ఆశిస్తున్నా’ అని కపిల్దేవ్ వ్యాఖ్యానించాడు.
Read More »న్యూఢిల్లీ-కర్ణాటక Express Trainలో బాంబు కలకలం
న్యూఢిల్లీ-కర్ణాటక Express Trainలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఓ వ్యక్తికి రైలులో క్యాటరింగ్ సిబ్బంది తీరు నచ్చలేదు. ఆగ్రహానికి గురైన అతడు సోదరుడికి చెప్పడంతో.. ఆ వ్యక్తి రైలులో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ సిబ్బంది మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్తో రైలు మొత్తం తనిఖీ చేశారు. బాంబు లేకపోవడంతో ఫోన్ కాల్పై విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.
Read More »అరటిపండ్లు కవర్లో పెడితే..?
అరటిపండ్లు కవర్లో పెడితే పాడైపోతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బయటకు తీసి విడివిడిగా ఉంచాలి. ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పేపర్లో చుట్టి పెట్టాలి. బంగాళదుంపలు చల్లని నీటిలో వేసినట్లయితే వాటి తొక్క సులువుగా ఊడిపోతుంది. కోడిగుడ్లు ఉడికించి తరువాత వాటిని ఒక డబ్బాలో వేసి ఊపాలి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్ల పెంకులన్నీ పగులుతాయి.
Read More »TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం
దేశంలో ఉన్న బీసీ కులాల జన గణన సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ప్రకటించడంపై TPCC చీఫ్, MP రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ కులాల జన గణన చేయడానికి కేంద్రంలోని మోదీ సర్కారు తిరస్కరించడం అంటే ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమే. బీసీలపై బీజేపీ ప్రేమ కొంగజపం-దొంగజపం అని దీన్ని బట్టి అర్థమవుతోంది. బీసీల మనోభావాలను గౌరవించని …
Read More »దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, అబ్బాయిల కనీస వివాహ వయస్సు 21గా ఉంది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తగ్గించాలని, చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయనే వాదనల నేపథ్యంలో కేంద్రం …
Read More »బాహుబలిని దాటిన పుష్ప
సినిమా ఇండస్ట్రీకి చెందిన ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా రూ.144.90 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.101.75 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన చిత్రాల జాబితాలో ‘పుష్ప’ 4వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ కంటే ముందు వరుసలో బాహుబలి 2, సాహో, సైరా నరసింహారెడ్డి ఉన్నాయి. అయితే బాహుబలి 1 రికార్డును ‘పుష్ప’ అధిగమించిందని …
Read More »లైగర్ విడుదలకు ముహుర్తం ఫిక్స్
టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో..రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న లైగర్ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ పాన్ ఇండియా మూవీని ఆగస్టు 25, 2022న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31న గ్లింప్స్ విడుదల చేస్తామని తెలిపింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రానుంది. ఇందులో విజయ్ దేవరకొండకు …
Read More »