శిల్పా చౌదరీ మహా కిలాడి. మాయమాటలు చెప్పి కోటీశ్వరులను ఈజీగా మోసం చేస్తోంది. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్లతో పరిచయాలు పెంచుకుని అందర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో పరిచయమైన వారి నుంచి కోట్లాది రూపాయలను వసూల్ చేసి ఆ తర్వాత కనిపించకుండా తిరుగుతోంది. ఈ కేసులో సినీ పరిశ్రమకు చెందిన శిల్పా చౌదరీని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీసులు అరెస్టు …
Read More »ఏపీలో దారుణం
Apలోని కర్నూలు జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టుకు ఓ యువతి దరఖాస్తు చేసుకుంది. కలెక్టరేట్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ యువతి నెంబర్ తీసుకుని.. ఉద్యోగం కావాలంటే చెప్పింది చేయాలని వేధించడం మొదలుపెట్టాడు. ఓ ఉన్నతాధికారితో ఏకాంతంగా గడిపితే ఉద్యోగం వస్తుందన్నాడు. అప్రమత్తమైన బాధితురాలు కాల్ రికార్డ్ చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన విచారణకు ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ చేశారు.
Read More »నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగింది
Ap అసెంబ్లీలో చర్చించడానికి ప్రతిపక్షం వద్ద ఏ అంశాలు లేక దురుద్దేశంతో వ్యవహరించిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీని కౌరవ సభ అని చంద్రబాబు వెళ్లిపోయారని విమర్శించారు. నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగిందని మండిపడ్డారు. సభలో బీసీలు, మైనారిటీల అంశాలతో పాటు వరద నష్టంపై చర్చించినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ కూడా ఓపిగ్గా సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు.
Read More »కనీస మద్దతు ధర కల్పించలేము
దేశంలో పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు.. చట్టం తేవడం సాధ్యం కాదన్నారు హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్. ఇది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు ఈ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు MSPకి చట్టబద్ధత కల్పించాలని దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read More »పచ్చి కొబ్బరి తింటే లాభాలెన్నో..?
పచ్చి కొబ్బరిని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనితో వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుంటాయి. *పచ్చి కొబ్బరి తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. *కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. *కొబ్బరితో మొటిమలు రావడం కూడా తగ్గుతుంది. *పచ్చకొబ్బరినీ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. *కొబ్బరిలో పోషకాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Read More »హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్
కరోనా కొత్త వేరియంట్ B.1.1.529 మళ్లీ హడలెత్తిస్తోంది. యువతపై ఎక్కువ ప్రభావమని శాస్త్రవేత్తలు చెప్పడం వణికిస్తోంది. దీని స్పైక్ ప్రొటీన్లోనే 30కిపైగా మ్యుటేషన్లు గుర్తించారు. డెల్టా, డెల్టా ప్లస్లలో 2-3 ఉండేవి. వ్యాక్సిన్లు ఈ వేరియంట్పై ఎలా పనిచేస్తాయనే క్లారిటీ లేదు. WHO దీనికి ‘ఒమిక్రాన్’ పేరు పెట్టి.. ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. దీంతో దేశాలు మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి.
Read More »మాధురీ దీక్షిత్ అందానికి కారణం అదే.?
1990లలో నటి మాధురీ దీక్షిత్ తన అందం, అభినయం.. నృత్యంతో ఆ రోజుల్లో దేశంలోని కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. సినిమాలు మానేసినా.. నేటికీ వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటోంది. ఇక, తన అందమైన చర్మానికి ఓ చిట్కా చెప్పింది ఈ బ్యూటీ. రోజూ మాధురీ కొబ్బరి నీళ్లు తాగుతుందట. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరమై.. చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉండేందుకు తోడ్పడుతుందని తెలిపింది.
Read More »‘ప్రాజెక్ట్-కె’ మూవీపై భారీ అంచనాలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల వేగాన్ని పెంచాడు. నాట్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న ‘ప్రాజెక్ట్-కె’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ మొదటివారం నుంచి మొదలుకానుంది. కొత్త షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ అవుతాడట. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో భారీ సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. దాదాపు రూ.300 కోట్లు బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కనుంది.
Read More »బాలయ్యను ఆకాశానికెత్తిన Heroine
Tollywood Star Hero..నందమూరి అందగాడు బాలయ్యపై నటి ప్రగ్యా జైస్వాల్ ప్రశంసలు కురిపించింది. అఖండ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ‘అంత పెద్ద హీరోతో నేను ఇది వరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనది టైం అంటే టైం. ఆయనతో నటించాలనగానే ఎంతో సర్వస్ ఫీలయ్యాను. ఆయన్ను కలిసిన 5 నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్ ఫీలయ్యేలా చేశారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్ను నేను ఇంత వరకు చూడలేదు. …
Read More »ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్
ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్ అని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ అభిప్రాయపడ్డాడు. అయితే.. కోహ్లికి బౌలింగ్ చేయడం తనకు ఎప్పుడూ కష్టంగా అనిపించలేదని పేర్కొన్నాడు. ఆ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మితికి బౌలింగ్ చేయడం కష్టంగా అనిపించేదని అమీర్ అన్నాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లిని అమీర్ అవుట్ చేసిన విషయం తెలిసిందే.
Read More »