Home / SLIDER / ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్

ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్

ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్ అని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ అభిప్రాయపడ్డాడు. అయితే.. కోహ్లికి బౌలింగ్ చేయడం తనకు ఎప్పుడూ కష్టంగా అనిపించలేదని పేర్కొన్నాడు.

ఆ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మితికి బౌలింగ్ చేయడం కష్టంగా అనిపించేదని అమీర్ అన్నాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లిని అమీర్ అవుట్ చేసిన విషయం తెలిసిందే.