ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 10,865 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 7390 కాగా, కొత్తగా సృష్టించినవి 3475 ఉన్నాయి. దీనిలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 4142 పోస్టులు, APVVP పరిధిలో 2520 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 4203 పోస్టులు ఉండగా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయనున్నారు.
Read More »Ap రాజ్ భవన్ లో కరోనా కలవరం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ కరోనా బారిన పడగా.. వారికి హైదరాబాద్ మహానగరంలోని AIG ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అటు విజయవాడలోని రాజభవన్లో పనిచేసే అధికారుల్లో కొందరితో పాటు గవర్నర్ వ్యక్తిగత సహాయ సిబ్బందికి కలిపి మొత్తం పది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజభవన్లో పనిచేసే సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు.
Read More »స్మృతి మంధాన అరుదైన రికార్డు
టీమిండియా మహిళా క్రికెటర్..బ్యూటీ స్మృతి మంధాన అరుదైన రికార్డు సాధించింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ తొలి శతకం సాధించిన భారత మహిళా క్రికెటర్ గా అవతరించింది. సిడ్నీ థండర్ తరఫున ఆడుతున్న మంధాన.. మెల్ బోర్న్ లో రెనెగేడ్స్ లో జరిగిన మ్యాచ్ సెంచరీ(114).తో చెలరేగింది. అయితే ఈమ్యాచులో సిడ్నీపై మెల్బోర్న్ విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా స్మృతి మంధాన ఎంపికైంది.
Read More »ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఈనెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాలకు సంబంధించి పార్లమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ సమావేశాల్లో కేంద్రాన్ని పలు అంశాలపై ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. లఖింపూర్, నామమాత్రంగా తగ్గించిన ఇంధన ధరలు, డ్రగ్స్ సరఫరా, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
Read More »ఇందిరా పార్క్ దగ్గర TRS మహాధర్నా
తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద అధికార టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించనుంది. ఈ మహాధర్నాలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉ. 11గం.- మ. 2గం. వరకు ధర్నాచౌక్ పార్టీ ముఖ్యనేతలంతా బైఠాయించనున్నారు. ధర్నా అనంతరం రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ తమిళ సై కి వినతి పత్రం సమర్పించనున్నారు. …
Read More »మానవతా దాతృత్వం చాటుకున్న చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి
చేవెళ్ల TRS Party లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి చేవెళ్ల ప్రాంతంలో కార్యక్రమానికి పాల్గొనడానికి వెళ్తున్నారు …ఈ క్రమంలో మల్కా పూర్ స్టేజ్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన కారును గమనించిన ఎంపీ రంజిత్ రెడ్డి తక్షణమే వెళ్లి ఆ ఆటో లో వున్న వ్యక్తులకు ఏమైనా గాయాలు అయ్యాయా… అని తెలుసుకొని ఆ సంఘటనలో గాయపడి వున్న క్షతగాత్రులను అటుగా …
Read More »భూమి రికార్డుల నిర్వహణలో మైలురాయిగా ధరణి పోర్టల్
భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని , ఒక సంవత్సర కాలంలోనే 10 లక్షల పైబడి లావాదేవీలు ధరణి ద్వారా జరిగినట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ టి.హరీశ్ రావు పేర్కొన్నారు. ధరణి పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో నిర్వహించిన సమావేశానికి మంత్రి శ్రీ టి.హరీశ్ రావు అధ్యక్షత వహించారు. ధరణి పోర్టల్ లో ఎదురవుతున్న వివిధ …
Read More »గురుకులాల్లో మంత్రి కొప్పుల ఆకస్మిక తనిఖీ
కరోనా అనంతరం పున:ప్రారంభమైన సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సమస్యలు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం రోజున హైదరాబాద్ గౌలిదొడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకుల (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్) బాలికల మరియు బాలుర పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదులు, హాస్టల్ భవనం, మెస్ హాల్, బాత్రూంలు సందర్శించారు. అనంతరం అక్కడి ప్రిన్సిపాల్, …
Read More »మా వడ్లు కొంటరా.. కొనరా? సేకరణపై స్పష్టతనివ్వండి
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత బియ్యం కొనుగోలు చేస్తారో స్పష్టతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం ప్రధానికి రెండు పేజీల లేఖను రాసిన కేసీఆర్.. వ్యవసాయరంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, పెరిగిన దిగుబడి గురించి వివరించారు. అదే సమయంలో దేశంలో ఆహార భద్రత కల్పనలో కేంద్రం బాధ్యతను విస్మరించరాదని పేర్కొన్నారు. ఈ లేఖను కేంద్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి …
Read More »ఢిల్లీ పాలకులకు బుద్ధి చెప్పాలి..
ఒక తండ్రి తన పిల్లలందరిని సమాన దృష్టితో చూస్తాడు. కానీ ఇప్పుడు దేశంలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ర్టాల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. తండ్రి పాత్ర పోషించాల్సిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ర్టాల మధ్య వివక్ష చూపుతున్నది. తెలంగాణ రైతు పండించిన వడ్లు కొనడానికి నిరాకరిస్తున్నది. పైగా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు వరి వేసుకోవాలంటూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విధానం. తెలంగాణ …
Read More »