బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తనపై చేసిన అరాచకాలను గుర్తుచేసుకొని మాజీ మావోయిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పులవేణి పోచమల్లుయాదవ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 2018లో ఈటల తనను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు దయతో బతికి బట్టకట్టానని చెప్పారు. తనకు జన్మనిచ్చింది తన తండ్రి అయితే పునర్జన్మ ఇచ్చింది కెప్టెన్ లక్షీకాంతారావు అని తెలిపారు. ఆదివారం హుజూరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఎంపీ లక్ష్మీకాంతారావు సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌లో …
Read More »దళిత బంధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడే శ్రీకారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 20వ శతాబ్దంలో సామాజిక న్యాయం ద్వారా దళితులకు విముక్తి కలిగిస్తే.. 21వ శతాబ్దంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆర్థిక సాధికారతతో వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. దళితుల ఆర్థిక …
Read More »రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం
రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భమని.. జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, …
Read More »తెలంగాణలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
పంద్రాగస్టు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి మహమూద్ …
Read More »ఎర్రకోట నుండి ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు
ఈరోజు దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా గల అన్ని సైనిక పాఠశాలల్లో ఇకపై బాలికలకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇంతవరకూ బాలురకు మాత్రమే సైనిక స్కూళ్లలో ప్రవేశం కల్పించేవారు. భారత రక్షణ రంగంలో యువతులకూ ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో సైనిక స్కూళ్లలో బాలికలకు ప్రవేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ …
Read More »ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన ప్రధాని మోదీ
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అజయ్‌భట్ స్వాగతం పలికారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు. …
Read More »దేశంలో తగ్గని కరోనా ఉధృతి
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 37,927 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 493 మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,92,576కు పెరిగింది. ఇందులో 3,13,76,015 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,85,336 యాక్టివ్ కేసులున్నాయి. మహమ్మారి …
Read More »సైనిక వీరులకు సీఎం కేసీఆర్ నివాళులు
సైనిక వీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అటునుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకుంటారు. కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కాగా, పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండ కోట సర్వాంగ …
Read More »ప్రగతి భవన్‌లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
ప్రగతి భవన్‌లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More »గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్
గోల్కొండ కోటపై జాతీయ జెండా రెపరెపలాడింది. 75వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కోండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, కళాకారులు స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్.. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఉన్న సైనిక వీరుల …
Read More »