టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న తమన్నా అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. తమన్నా కేవలం కమర్షియల్ పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ గా తనకు గుర్తింపు తెచ్చి పెట్టే సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను చేయాలని ఆశ పడుతోంది. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలతో తన టాలెంట్ నిరూపించాలని అనుకుంటుంది. ఒకవైపు హీరోయిన్‌గా, మరో వైపు ఐటెం సాంగ్స్ చేస్తూనే వెబ్ సిరీస్‌లకు సిద్ధం అవుతుంది. ఇంకో …
Read More »ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు
ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. 1980 తర్వాత ఒలింపిక్స్ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బుధవారం జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్ 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 సంవత్సరాల సుధీర్ఘ …
Read More »మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్గో పార్సిల్, కవర్ సర్వీసుల ద్వారా హోం డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నామని ఖమ్మం ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతేడాది జూన్ 19న మంత్రి పువ్వాడ ఆర్టీసీలో కార్గో సేవలు ప్రారంభించారు. అనతికాలంలోనే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలకు కార్గో సేవలు మరింత చేరువయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం నగరంలో …
Read More »లాడ్జి అంటే.. చెప్పుతో కొడ్తా
లాడ్జి వ్యవహారం అంటూ క్యూ న్యూస్‌లో తీన్మార్ మల్లన్న వాడిన భాషపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఓ వీడియోను విడుదల చేసిన యువతి తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్‌కుమార్‌పై విరుచుకుపడింది. లాడ్జి వ్యవహారం అని ఎట్లా అంటావని ప్రశ్నిస్తూ, చెప్పుతో కొడ్తానని తీవ్రంగా మండిపడింది. ‘న్యూస్‌లో నా ఫొటోలు ప్రసారం చేసేకంటే ఒక రోజు ముందు ఏదైనా ఉంటే మీరు మీరే చూసుకోండి అని మెస్సేజ్ పెట్టిన. …
Read More »రెండున్నర గంటలు.. 4.5 కిలోమీటర్ల నడక
వాసాలమర్రి గ్రామంలో మీదివాడ, కిందివాడ పేరుతో రెండు ఎస్సీవాడలున్నాయి. మొత్తం 76 కుటుంబాలు ఉన్నాయి. మీదివాడ.. ఊరికి తూర్పువైపున, కిందివాడ ఊరికి పడమర దిక్కు ఉన్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల సీసీరోడ్లు ఉండగా, మరికొన్ని గల్లీల్లో మట్టిరోడ్లు మాత్రమే ఉన్నాయి. సీఎం కేసీఆర్ తన పర్యటనను కిందివాడ నుంచి ప్రారంభించారు. మీదివాడను, కిందివాడను అనుసంధానం చేసే సీసీరోడ్డు మీదుగా సీఎం పర్యటిస్తారని అధికారులు భావించారు. కానీ వారి అంచనాకు భిన్నంగా …
Read More »గంటకు పైగా దళితవాడలో పర్యటించిన సీఎం కేసీఆర్
దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. సుమారు గంటకు పైగా దళితవాడలో సీఎం పర్యటించారు. దళిత వాడలోని 60 కుటుంబాలను సీఎం కేసీఆర్ పలుకరించి.. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు ఇంట్లో కేసీఆర్ భోజనం చేశారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామాభివృద్ధిపై గ్రామస్థులతో చర్చించారు. గత పర్యటన సందర్భంగా తాను చేసిన పలు సూచనల అమలుతీరుపై ఈ సందర్భంగా …
Read More »ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం : మంత్రి కేటీఆర్
తెలంగాణలో 60 లక్షల పైచిలుకు కుటుంబ సభ్యులను కలిగిన అజేయమైన శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగింది. వీరందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని తేల్చిచెప్పారు. వారికి తప్పకుండా పార్టీ అండగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వివిధ ప్రమాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు కేటీఆర్ బీమా సాయం అందించారు. తెలంగాణ భవన్‌లో 80 మంది నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు రూ. 2 …
Read More »కుటుంబాల్లో ఆపద వస్తే అధైర్యపడొద్దు- మంత్రి నిరంజన్‌రెడ్డి
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాల్లో ఆపద వస్తే అధైర్యపడొద్దని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వారికి భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వనపర్తిలోని తన నివాసంలో బుధవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. సీఎంఆర్‌ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక …
Read More »6గురు ఎంపీలపై సస్పెండ్ వేటు
రాజ్యసభ ( Rajya Sabha ) కు చెందిన ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ( TMC ) ఎంపీలను చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు. పెగాసస్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని వెల్‌లోకి దూసుకువచ్చిన ప్లకార్డులు ప్రదర్శించిన ఘటనలో ఆ ఎంపీలను బహిష్కరించారు. ఒక రోజు పాటు వారిపై సస్పెన్షన్ విధించారు. సస్పెండ్ అయినవారిలో డోలాసేన్, నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంతా చెత్రి, అర్పితా ఘోష్, మౌసమ్ …
Read More »ఏపీ పాలిసెట్-2021 తేదీ ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష (ఏపీ పాలిసెట్-2021)ను సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించినట్లు ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 380 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పాలిసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. కొవిడ్ దృష్ట్యా అవసరమైతే దరఖాస్తు గడువును పొడిగిస్తామని …
Read More »