బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరో ఛాలెంజింగ్ రోల్‌లో నటించబోతోందని తాజాగా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది. ‘పేపర్ బాయ్’, ‘విటమిన్-షి’ సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్. ఆయన ఓ ఆంథాలజీ మూవీని తెరకెక్కించనున్నాడు. ఇదీ 6 కథల సమ్మేళనం ఉంటుందట. ప్రతి కథలో ఒక ప్రముఖ నటీనటులు …
Read More »ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ చేయబోతోందని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ పూర్తిచేసిన ప్రభాస్, ప్రస్తుతం ‘సలార్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే …
Read More »‘పుష్ప’ విడుదలకు ముహూర్తం ఫిక్స్
కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమా ఇండస్ట్రీ మళ్లీ దార్లోకి వస్తుంది. థియేటర్లు తెరుచుకున్నాయి. ఒక్కో సినిమా థియేటర్ విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి డేట్స్ పవన్, ప్రభాస్, మహేశ్‌బాబు చిత్రాలతో లాక్ అయిపోయాయి. తాజాగా అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా విడుదల కూడా ఖరారైంది. సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో …
Read More »CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలు ( CBSE results ) విడుదలయ్యాయి. జూలై 30న 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డు ఇవాళ 10వ తరగతి ఫలితాలను కూడా వెల్లడించింది. కరోనా మహమ్మారి విస్తృతి కారణంగా CBSE ఈసారి పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థులు గత ఏడాది కాలంగా రాసిన యూనిట్ పరీక్షలు, ప్రాక్టికల్స్, ప్రీ బోర్డు, మిడ్ టర్మ్ పరీక్షల్లో సాధించిన …
Read More »రేపు వాసాలమర్రికి ముఖ్యమంత్రి కేసీఆర్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మరో 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రేపు గ్రామాన్ని సందర్శించనున్నారు. ఇంతకు ముందు జూలై 9న గ్రామ పర్యటనకు సిద్ధమైనా.. వాయిదా పడింది. సీఎం గ్రామంలోని దళితవాడలో పర్యటించడంతోపాటు రైతువేదికలో …
Read More »సీఎం చేతుల మీదుగా 57 ఏండ్ల పెన్షన్లు ప్రారంభిస్తాం
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 ఏండ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వాళ్లందరికి పెన్షన్లు అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో కొత్తగా మరో 6,62,000 మందికి ప్రతి నెలా రూ. 2016 వృద్ధాప్య పెన్షన్ అందనున్నదని మంత్రి తెలిపారు.ఈ మేరకు తమ శాఖ అధికారులు …
Read More »ఈ నెల నుంచే కరోనా థర్డ్‌వేవ్
దేశంలో ఈ నెల నుంచే కరోనా థర్డ్‌వేవ్ (మూడో ఉద్ధృతి) ప్రారంభమయ్యే అవకాశమున్నదని పరిశోధకులు తెలిపారు. అక్టోబర్‌లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరవచ్చని పేర్కొన్నారు. ఈ సమయంలో రోజువారీ కేసులు గరిష్ఠంగా లక్షన్నర వరకు నమోదవ్వచ్చని అంచనా వేశారు. అయితే, సెకండ్‌వేవ్‌తో పోలిస్తే, థర్డ్‌వేవ్ తీవ్రత తక్కువేనని తెలిపారు. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ మతుకుమల్లి విద్యాసాగర్, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన మణీంద్ర అగర్వాల్ మ్యాథమెటికల్ …
Read More »తెలంగాణ రాష్ట్రంలో 51 శాతం మందికి తొలి డోసు పూర్తి
కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే బ్రహ్మాస్త్రం. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకుంటే, అంత త్వరగా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ సూత్రాన్ని తెలంగాణ సర్కారు పక్కాగా అమలు చేసింది. జనవరి 16 నుంచి ఇప్పటి వరకు తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య రాష్ట్రంలో 51 శాతానికి చేరింది. వ్యాక్సిన్ తీసుకోని 25 శాతం మందిలో ప్రతిరక్షకాలు ఉన్నట్టు సీరో సర్వే ఇటీవల వెల్లడించింది. మొత్తంగా 76 …
Read More »ఉప ఎన్నికలో గెలుపు “గులాబీ”దే
హుజురాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ విజయం తథ్యమని, 50 వేల మెజార్టీతో గెలుపును సి ఎం కేసీఆర్ కు బహుమతిగా అందివ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. సోమవారం హుజురాబాద్ రూరల్, టౌన్ కు సంబంధించిన ముఖ్య కార్యకర్తల, ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తల సమావేశం సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి రావు మాట్లాడుతూ హుజురాబాద్ లో టిఆర్ఎస్, బీజేపీ …
Read More »సీఎం కేసీఆర్ ప్రశ్నకు జవాబేది?
‘దళితబంధు’ పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభించటం గురించి చాలా చర్చ జరుగుతున్నది. ఈ పథకం ఉప ఎన్నిక లబ్ధి కోసమన్నది విమర్శ కాగా, పథకానికి నిధులు గత బడ్జెట్‌లోనే కేటాయించామన్నది ప్రభుత్వ వివరణ. అదే సమయంలో, ఒకవేళ ఎన్నికల ప్రయోజనానికి ఒక చర్య తీసుకుంటే తప్పేమిటనే మౌలికమైన ప్రశ్నను కేసీఆర్ లేవనెత్తుతున్నారు. ఇందుకెవరూ జవాబివ్వటం లేదు. ఇది ఎప్పటికైనా చర్చించవలసిన ప్రశ్నే. దళితుల పట్ల కేసీఆర్‌కు గల తపన గురించి …
Read More »