ఏపీ తెలుగుదేశం పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు.! ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీకి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బై బై చెప్పేసి వైసీపీకి మద్దతివ్వడం.. వారి కుటుంబ సభ్యులకు కండువాలు కప్పించేశారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలు వైసీపీ కండువాలు కప్పేసుకున్నారు. అయితే తాజాగా.. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా …
Read More »‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల
‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమా జులై 20న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముదుకురాబోతోంది. ఇందులో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇటీవలే మొదటి పాట ‘చలాకి చిన్నమ్మి’ పాటను విడుదల చేయగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ‘ఓ.. నారప్ప.. నువ్వంటే …
Read More »దేశంలో 38,079 కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,079 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మరో 560 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 3.10 కోట్లకు చేరింది. ఇందులో 4,24,025 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,13,091 మంది మరణించారు. ఇప్పటివరకు 3.02 కోట్ల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా …
Read More »కొత్త వ్యాపారంలోకి షకీలా
అప్పట్లో కుర్రకారుని తన సినిమాలతో ఉర్రూతలూగించిన షకీలా కొన్నాళ్లకు కనుమరుగైంది. ఇటీవల తన బయోపిక్‌తో మరోసారి వార్తలలోకి వచ్చిన షకీలా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో పలు సంచలన కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది. ఇప్పుడు షకీలా నిర్మాతగా మారి సినిమాలు తీస్తుంది. రమేష్ కావలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలకు అట్టర్ ప్లాప్, రొమాంటిక్ పేర్లు ఖరారు చేశారు. వీటిల్లో షకీలా కుమార్తె మిలా హీరోయిన్ …
Read More »42 బంతుల్లోనే సెంచరీ చేసిన లియామ్ లివింగ్‌స్టోన్
లియామ్ లివింగ్‌స్టోన్ కళ్లు చెదిరే సెంచరీ చేసినా.. ఇంగ్లండ్‌కు విజయం దక్కలేదు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో ఆ జట్టు 31 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. 233 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు.. లివింగ్‌స్టోన్ ఆశాకిరణంలా కనిపించాడు. భారీ షాట్లతో అతను హోరెత్తించాడు. కేవలం 17 బంతుల్లో 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ టీ20 చరిత్రలో ఇది కొత్త రికార్డు. …
Read More »నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జూలై 17 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఇది అంతర్జాతీయ నేర విభాగంలో న్యాయాన్ని సైతం ప్రోత్సాహిస్తుంది. ప్రస్తుత రోజుల్లో న్యాయ వ్యవస్థ సామాన్యుడికి న్యాయం కలిగేలా పలు చట్టాలను అందుబాటులోకి తెచ్చింది. చరిత్ర: రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17ను అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా 1998లో నిర్ణయంచారు. అయితే శిక్షార్హతకు వ్యతిరేకంగా …
Read More »కేంద్రంపై పోరాడాలి- సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో ప్రస్తావించాల్సిన తెలంగాణ అంశాలు, సమస్యలపై సిఎం కెసిఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై సిఎం వారితో చర్చించారు. ముఖ్యంగా…సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని …
Read More »వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త
వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకూ బీసీ గురుకులాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచితవిద్య పొందుతుండగా, తాజాగా ఇంటర్మీడియట్ ను కూడా అక్కడే చదివేలా అన్ని ఏర్పాట్లకు సిద్ధమైంది. ఈ ఏడాది 119 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు తెలిపారు. బీసీ గురుకులాలపై శుక్రవారం …
Read More »దత్తత గ్రామానికి రూ.6కోట్లు మంజూరు
తన దత్తత గ్రామమైన కీసరలో సమస్యల పరిష్కారానికి మొదటి విడతగా రూ.6 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తెలిపారు. ఈనెల 1 నుంచి 10వరకు కీసర గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్‌కుమార్ కీసర గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి విధితమే. అదే సమయంలో గ్రామాభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నానని, గ్రామంలో నెలకొన్న …
Read More »ఆ లోటు ఎల్.రమణ రాకతో తీరింది: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారానికి ఎల్.రమణ పార్టీలో చేరారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. తెరాసలో చేరిన ఎల్. రమణకు కేసీఆర్ హృదయపూర్వక స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. తెరాసలో చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదన్న లోటు రమణతో తీరిందని చెప్పారు. చేనేత కార్మికులకు రైతు బీమా కోసం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. తెరాస పథకాలు ప్రతి …
Read More »