ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా బారినపడిన ఎస్వీ ప్రసాద్.. నగరంలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఉమ్మడి ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కుటుంబం ఇటీవల కరోనా బారిన పడింది. ఆయనతోపాటు కుంటుంబ సభ్యులు యశోద …
Read More »తెలంగాణలో కొత్తగా 2,524 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 2,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది మరణించారు. 3,464 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం 34,084 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 24 గంటల్లో 87,110 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 307 పాజిటివ్ కేసులు, నల్లగొండ జిల్లాలో 183, రంగారెడ్డి జిల్లాలో …
Read More »2డీజీ మందును అసలు ఎవరు..? ఎలా వాడాలి.. ఇవీ డీఆర్డీవో గైడ్‌లైన్స్
కరోనాపై డీఆర్డీవో సంధించిన అస్త్రం 2డీజీ. పొడి రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఔషధం.. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్లపై బాగా పని చేస్తున్నట్లు డీఆర్డీవో చెప్పింది. తాజాగా ఈ 2డీజీ మందును ఎలా వాడాలో చెబుతూ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందును వాడాలని స్పష్టం చేసింది. ఆ గైడ్‌లైన్స్‌లో ఇంకా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న …
Read More »మంత్రి కేటీఆర్ పై సోనుసూద్ ప్రశంసలు
తెలంగాణ రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రశంసించారు. కేటీఆరే నిజమైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సోనూసూద్ పేర్కొన్నారు. అయితే నంద కిశోర్ తోకల అనే ఓ నెటిజన్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. తాము సంప్రదించిన 10 గంటలలోపే తమకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చారని, ఆ మేలు ఎప్పటికీ మరిచిపోలేమని అతను పేర్కొన్నాడు. …
Read More »పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ కవిత
పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాలలో నాలుగు వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని చెప్పారు. జిల్లాలోని నూకపెల్లిలో నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్‌తో కలిసి కవిత పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన ఇండ్లు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిస్తున్న ఇండ్ల తేడాను ప్రజలు …
Read More »అందరికీ తొలి డోసు వ్యాక్సిన్‌కు ఎంత కాలం పడుతుందో తెలుసా
ఈ 2021 ఏడాది ముగిసేలోపు దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పూర్తి వ్యాక్సినేషన్ కాదు కదా.. కేంద్రం చెప్పిన సమయానికి అందరికీ కనీసం తొలి డోసు వ్యాక్సిన్ ఇవ్వడం కూడా కుదరదని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. దేశంలో 18 ఏళ్లు నిండిన వాళ్లు 94.4 …
Read More »తీవ్ర అస్వస్థతకు గురైన తమ్మినేని సీతారాం
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా స్పీకర్ జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవలే స్పీకర్ దంపతులకు కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే.
Read More »Big Breaking-ఆనందయ్య మందుపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
ఏపీలో కరోనా మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం …
Read More »వివాదంలో మీరా చోప్రా
నటి మీరా చోప్రా ఓ వివాదంలో చిక్కుకుంది. థానేలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఆమె ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె ఫ్రంట్లైన్ వారియర్గా చెప్పుకుని తప్పుడు పత్రాలు చూపి వ్యాక్సిన్ తీసుకుందని BJP నేత ఒకరు ఇందుకు సంబంధించిన ఆధారాలు పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ‘బంగారం, వాన, మారో’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ఎన్నో హిందీ, తమిళ …
Read More »డీ గ్లామర్ పాత్రలో కాజల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ క్వీన్ కాజల్ తొలిసారి ఓ డీ గ్లామర్ రోల్లో నటించనుంది. కొత్త దర్శకుడు జయశంకర్ తెరకెక్కించే ఓ మహిళా నేపథ్య సామాజిక కథాంశంలో కాజల్ నటించనుంది. ఇందులో ఆమె డీ గ్లామర్ పాత్రలో కన్పించనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Read More »