Home / NATIONAL / 2డీజీ మందును అసలు ఎవ‌రు..? ఎలా వాడాలి.. ఇవీ డీఆర్డీవో గైడ్‌లైన్స్‌

2డీజీ మందును అసలు ఎవ‌రు..? ఎలా వాడాలి.. ఇవీ డీఆర్డీవో గైడ్‌లైన్స్‌

 క‌రోనాపై డీఆర్డీవో సంధించిన అస్త్రం 2డీజీ. పొడి రూపంలో అందుబాటులోకి వ‌చ్చిన ఈ ఔష‌ధం.. మోస్తరు నుంచి తీవ్ర ల‌క్ష‌ణాలు ఉన్న క‌రోనా పేషెంట్ల‌పై బాగా ప‌ని చేస్తున్న‌ట్లు డీఆర్డీవో చెప్పింది.

తాజాగా ఈ 2డీజీ మందును ఎలా వాడాలో చెబుతూ ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఈ మందును వాడాల‌ని స్ప‌ష్టం చేసింది. ఆ గైడ్‌లైన్స్‌లో ఇంకా ఏమున్నాయో ఒక‌సారి చూద్దాం.

ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల‌కు ఇస్తున్న చికిత్స‌కు అనుబంధంగా ఈ ఔష‌ధం అత్య‌వ‌సర వినియోగానికి డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది.
మోస్త‌రు నుంచి తీవ్ర కొవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న పేషెంట్ల‌కు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా డాక్ట‌ర్లు ఈ మందును ప్రిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది. గ‌రిష్ఠంగా ప‌ది రోజుల పాటు దీనిని వాడొచ్చు.

నియంత్ర‌ణ లేని డ‌యాబెటిస్‌, తీవ్ర‌మైన‌ గుండె జ‌బ్బులు, ఏఆర్డీఎస్ వంటి వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారిపై ఈ ఔష‌ధాన్ని ఇంకా పూర్తిగా ప‌రీక్షించి చూడ‌లేదు. అందువ‌ల్ల కాస్త ముందు జాగ్ర‌త్త అవ‌స‌రం.

ఈ 2డీజీ ఔష‌ధాన్ని గ‌ర్భిణులు, బాలింత‌లు, 18 ఏళ్ల లోపు పేషెంట్ల‌కు ఇవ్వ‌కూడ‌దు.

2DG@drreddys.comకు మెయిల్ చేయ‌డం ద్వారా హైద‌రాబాద్‌లోని డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌ను 2డీజీ ఔష‌ధం స‌ప్లై చేయాల‌ని పేషెంట్లు, వాళ్ల అటెండ‌ర్లు ఆయా హాస్పిట‌ల్స్‌ను కోర‌వ‌చ్చు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat