Home / rameshbabu (page 758)

rameshbabu

జర్నలిస్టు TNR కి అండగా చిరు

ప్రముఖ నటుడు,యాంకర్ జర్నలిస్ట్ TNR మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. TNR భార్యా పిల్లలను ఫోన్లో పరామర్శించారు చిరు.. తక్షణ ఖర్చుల కోసం రూ.లక్ష సాయం చేశారు. ‘TNR ఇంటర్వ్యూలను ఎన్నో చూశా. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం బాగుంటుంది. పట్టుదలతో ఎదిగిన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎలాంటి అవసరం వచ్చినా మీ కుటుంబానికి నేనుంటా’ అని చిరు చెప్పారు. అటు హీరో సంపూర్ణేష్ బాబు …

Read More »

తెలంగాణలో వ్యవసాయ రంగానికి లాక్డౌన్ మినహాయింపు

తెలంగాణలో నేటి నుండి 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుండగా.. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లులకు లాక్ డౌన్ వర్తించదు. FCIకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, విత్తనాల షాపులు, సంబంధిత రవాణా, విత్తన తయారీ కర్మాగారాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం యథావిథిగా కొనసాగించనుంది.

Read More »

బాబుపై కేసు నమోదు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్రంలోని గుంటూరులో కేసు నమోదైంది. న్యాయవాది అనిల్కుమార్ ఫిర్యాదుతో అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. కరోనాపై ప్రజలను భయపెట్టేలా మాట్లాడారని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబుపై కర్నూలు పోలీస్టేషన్లో కేసు నమోదైంది.

Read More »

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 4,801 పాజిటివ్ కేసులు.. 32 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 5,06,988కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 2,803 మంది మృతి చెందారు. కరోనా నుంచి 4,44,049 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.. రాష్ట్రవ్యాప్తంగా 60,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 75,289 నమూనాలను పరీక్షించారు.

Read More »

తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు వీటికే…

తెలంగాణలో రేపటి నుండి లాక్డౌన్ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి విధితమే. అయితే    లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు : – వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు. – …

Read More »

తెలంగాణ క్యాబినేట్ నిర్ణయాలు

ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాలు : – మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి …

Read More »

రికార్డ్ స్థాయిలో పోలవరం పనులు

మా హాయాంలో పోలవరం పనులు పరుగులుపెట్టాయి,ప్రతి సోమవారం పోలవరం అంటూ మా చంద్రబాబు ఇంజనీర్లను పరుగులు పెట్టించాడు అంటూ డప్పులు కొట్టుకోవడమే కాదు జనాలను సైతం బస్సుల్లో తరలించి భజనలు కూడా చేయించుకున్నారు నాటి పాలకులు.అదిగో పోలవరం పూర్తి చేసేస్తున్నామంటూ జనాలకు గ్రాఫిక్స్ చూపిస్తే వాళ్ళు మాత్రం పచ్చబ్యాచ్ కి త్రీడి సినిమానే చూపించారు. రెండేళ్ళ క్రితం వరకు ప్రాజెక్టు మన తరంలో పూర్తవుతుందా అంటూ చూసొచ్చినోళ్ళందరూ నోరెళ్ళబెట్టుకుంటే అధికారంలోకి …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనాకు గురయ్యారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము. కొద్దిరోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారంతా.. టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ క్షేమంగా …

Read More »

కంగ‌నా ర‌నౌత్ కి ఇన్‌స్టాగ్రామ్ భారీ షాక్

బాలీవుడ్ అందాల రాక్షసి.. వివాదస్పద నటి  కంగ‌నా ర‌నౌత్ అకౌంట్‌ను ట్విట్ట‌ర్ స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ షాక్ నుంచి కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ బ‌య‌ట ప‌డ‌క ముందే, మ‌రో ప్ర‌ధాన సోష‌ల్ మీడియా మాధ్య‌మ ఇన్‌స్టాగ్రామ్ ఆమెకు షాకిచ్చింది. వివ‌రాల్లోకి వెళితే రెండు రోజుల ముందు తాను క‌రోనా బారిన ప‌డ్డానంటూ కంగ‌న పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కంగ‌న త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేస్తుందంటూ విమ‌ర్శ‌లు …

Read More »

లస్సీతో లాభాలు

లస్సీతో లాభాలు ఏమి ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం -లస్సీలో ఉండే ఓ రకమైన బ్యాక్టీరియా తినే ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తుంది. – లస్సీలోని కాల్షియం, ప్రోటీన్స్ కండరాలకు శక్తిని,పెరుగుదలను ఇస్తాయి. – లస్సీలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మన శరీరాన్ని తేమగా ఉంచుతాయి. ఎండలో తిరిగినా చర్మం కమిలిపోకుండా ఉంటుంది. – లస్సీలో ఉండే లాక్టిన్, విటమిన్ D ఇమ్యూనిటీని పెంచి, ఎముకలకు బలాన్ని ఇస్తాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat