బాలీవుడ్ అందాల రాక్షసి.. వివాదస్పద నటి కంగనా రనౌత్ అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి కాంట్రవర్సీ క్వీన్ బయట పడక ముందే, మరో ప్రధాన సోషల్ మీడియా మాధ్యమ ఇన్‌స్టాగ్రామ్ ఆమెకు షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే రెండు రోజుల ముందు తాను కరోనా బారిన పడ్డానంటూ కంగన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే కంగన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుందంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్, ఈమె పోస్ట్ చేసిన పోస్ట్‌ను తొలగించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తెలియజేస్తూ… ‘కొవిడ్‌ను నాశనం చేద్దామని నేను చేసిన పోస్ట్‌ను ఇన్‌స్టా తొలగించింది.
ఈ పోస్ట్ వల్ల కొందరు బాధపడి ఉంటారనుకున్నా. ఉగ్రవాదులు, కమ్యూనిస్టులు, సానభూతిపరులు ట్విట్టర్‌లోనే ఉంటారని అనుకున్నాను’ అని తెలిపింది కంగనా రనౌత్. అలాగే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ ఇన్‌స్టాలోనూ పోస్ట్ చేసింది. మరిప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి