తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు, కమెడియన్ సునీల్.. తమిళ సినిమా తెలుగు రీమేక్లో నటించనున్నాడని తెలుస్తోంది. గత నెలలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు నటించిన ‘మండేలా’ సినిమా నెటి ప్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ అనిల్ సుంకర.. AK ఎంటర్టైన్ మెంట్స్ సొంతం చేసుకుంది. ముందు బండ్ల గణేశ్ అనుకున్నా.. ఇప్పుడు ‘మండేలా’ …
Read More »ఆ మెగా హీరోపై మనసు పారేసుకున్న బుజ్జమ్మ
ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమా తర్వాత కృతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఉప్పెన షూటింగ్కి ముందు దర్శకుడు తనను కొన్ని సినిమాలు చూడమని కోరాడట. అన్నింటిలో కృతికి ‘రంగస్థలం’ బాగా నచ్చిందట. ఆ సినిమా చూశాక రామ్ చరణ్ అభిమానినైపోయానని చెప్పుకొచ్చింది. ఆయనతో ఓ సినిమా చేయాలనేది తన కోరిక అంటోంది కృతి.
Read More »తొలిసారిగా చైతూ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో అక్కినేని నాగచైతన్య.. తొలిసారి వెబ్ సిరీస్లో ముందుకు రానున్నాడు. చైతూ లీడ్ రోల్లో అమెజాన్ ప్రైమ్ సరికొత్త సిరీస్ రూపొందిస్తోంది. నాగచైతన్య.. తన OTT ఎంట్రీ యాక్షన్ థ్రిల్లర్తో చేయనున్నాడు. విక్రమ్ కె కుమార్.. ఈ సిరీసు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. జులైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతూతో పాటు రాధిక ఆప్టే, అతుల్ కులకర్ణి లాంటి పాన్ ఇండియా యాక్టర్స్ …
Read More »వరుసగా మూడో రోజు పెట్రోల్ మంట
దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వరుసగా మూడో రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో గురువారం లీటర్ పెట్రోలుపై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను చమురు సంస్థలు పెంచాయి. ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 23 పైసలు పెరగగా.. రూ.94.57కు చేరింది. డీజిల్ ధర లీటరుకు 31 పైసలు పెరగగా.. రూ. 88.77కు ఎగబాకింది.
Read More »దేశంలో 4,12,262 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో ఏకంగా 4,12,262 కేసులు, 3,980 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,10,77,410కి చేరింది. మరణాల సంఖ్య 2,30,168కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,72,80,844 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 35,66,398 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »KYC అప్డేట్ పై ఆర్బీఐ కీలక ప్రకటన
అన్ని ప్రభుత్వ ప్రయివేట్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వినియోగదారులు KYC అప్డేట్ తప్పనిసరిగా చేయాలని గతంలో RBI సూచించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్డేట్ చేయడంలో విఫలమైన వినియోగదారులపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను RBI తాజాగా కోరింది. దీంతో డిసెంబర్ 31 వరకు KYC అప్ డేట్ చేసుకోకపోయినా.. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Read More »టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా
ఏపీలో సంచలనం సృష్టించిన సంగం డెయిరీలో అక్రమాలకు సంబంధించి అరెస్టైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ తేలింది. ఇటీవల జ్వరం, జలుబు లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని హైకోర్టు ఏసీబీ అధికారులను ఆదేశించింది. దీంతో నరేంద్రను రాజమహేంద్రవరం జైలు నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించనున్నారు.
Read More »విజయ్ దేవరకొండ సరసన కత్రినా కైఫ్
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సరసన నటించనున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లైగర్ పూర్తైన తర్వాత తన సినిమా ప్రకటించాలని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహర్ భావించాడట. అయితే, ఈ సినిమా గురించి సమాచారం ముందుగానే బయటకి వచ్చేసింది. అన్ని అనుకున్నట్లు కుదిరితే కత్రినాతో విజయ్ రొమాన్స్ చేయడం ఖాయమంటున్నాయి బీటౌన్ వర్గాలు.
Read More »తప్పుడు కథనమని ఒప్పుకున్న ఆదాబ్ హైదరాబాద్
ఆగం అయిన ఆదాబ్ హైదరాబాద్..తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటిపై ఇటివల ”జీఓయంఎస్ 67 ను ఉల్లంఘించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ” అంటూ వచ్చిన కథనం తో పొరపాటు దొర్లినట్టు అదాబ్ హైదరాబాద్ పేపర్ యాజమాన్యం దృవీకరించింది. . వారి పేపర్ స్థానిక విలేకరి ఎమ్మెల్యే గారిని కుటుంబ సభ్యులను డబ్బులు అడగగా వారు ఇవ్వకపోవడంతో వారిని …
Read More »ఈటలది అధికార దుర్వినియోగం -ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను తెలిసీ కొనడం ముమ్మాటికీ తప్పేనని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ గెస్ట్‌హౌస్‌లో లక్ష్మీకాంతారావు మీడియాతో మాట్లాడారు. పదవులు అడ్డుపెట్టుకొని ఈటల అధికార దుర్వినియోగం చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను కొనడమే కాకుండా.. ప్రభుత్వం కొనడం లేదా? అని ప్రశ్నించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. 66 ఎకరాల అసైన్డ్ భూమిని …
Read More »