ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 51 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,89,010కి చేరింది. ఇందులో 609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 8,81,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా… మొత్తం 7,165 మరణాలు సంభవించాయి..
Read More »క్యాబేజీతో లాభాలెన్నో…?
క్యాబేజీ లాభాలు ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు.. విటమిన్ C ఎక్కువుండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. విటమిన్ A, B6, పీచు పదార్థాలు, రిబోఫ్లేవిన్, ఫోలెట్ అధికం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది రక్తంలో చక్కెర నిల్వలను సమతుల్యం చేస్తుంది శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా చేస్తుంది నిద్రపట్టేందుకు సహకరించే లాక్ట్యుకారియం ఉంటుంది అధిక బరువు, కండరాల నొప్పులు తగ్గుతాయి..
Read More »అనిరుధ్-కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ
మహానటి ఫేం కీర్తి సురేష్..తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను వివాహం చేసుకోనుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరు కలిసి అన్యోన్యంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. అతి త్వరలోనే కీర్తి , అనిరుధ్ వివాహం ఉంటుందని పుకార్లు పుట్టించారు. దీనిపై ఇటు అనిరుధ్ కాని, అటు కీర్తి కాని రియాక్ట్ కాలేదు. కీర్తి- అనిరుధ్ వివాహం అంటూ కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను వారి క్లోజ్ ఫ్రెండ్స్ ఖండించారు. చాన్నాళ్లుగా …
Read More »ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఏపీలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది ఇవాళ 30 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,88,899కి చేరింది. ఇక ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 7,163కి పెరిగింది. ఇక ఇవాళ 60 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 695 యాక్టివ్ కేసులున్నాయి
Read More »హాట్ హాట్ గా అనసూయ
ఒకవైపు బుల్లితెరపై యాంకరింగ్ తో బిజీగా ఉంటూనే అప్పుడప్పడూ సినిమాల్లో మెరుస్తున్న అనసూయ ‘చావు కబురు చల్లగా’లో కన్పించనుంది. ఇందులో ఆమె ఓ స్పెషల్ సాంగ్ లో నటించనున్నది. ఇందుకు సంబంధించి ఫొటోలు విడుదలయ్యాయి. లావణ్య త్రిపాఠి, కార్తికేయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని బన్నీవాస్ నిర్మిస్తున్నాడు.
Read More »షూటింగ్ లో కీర్తి సురేష్ హడావుడి
టాలీవుడ్ సూపర్ స్టార్ , హీరో మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేశ్ ఇవాల్టి నుంచి షూటింగ్ లో పాల్గొంటోంది అటు ఈ సెకండ్ షెడ్యూల్ చిత్ర యూనిట్ ఓ సాంగ్ షూట్ చేసేందుకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ లవర్ బాయ్ గా కన్పించనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ MB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి
Read More »అభిమానికి ఫోన్ చేసిన బాలయ్య
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ తన అభిమానికి ఫోన్ చేసి పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన పత్తి మనోహార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన బాలయ్యకు వీరాభిమాని. విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన అభిమానికి ఫోన్ చేసి బాలకృష్ణ ధైర్యం చెప్పారు. ‘ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని… అతడి కుటుంబానికి తామంతా అండగా ఉంటామని’ భరోసానిచ్చారు. తన అభిమాన హీరో ఫోన్లో మాట్లాడుతుంటే మనోహార్ కంటతడి …
Read More »MS ధోనీ మూవీలోని సహా నటుడు సందీప్ నహర్ ఆత్మహత్య.. ఎందుకంటే..?
బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ (33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగతంగా, వృత్తిరీత్యా ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని లేఖ రాశాడు. అటు చనిపోయే ముందు సోషల్ మీడియాలో తాను చనిపోతున్న విషయాన్ని వెల్లడించాడు. ‘MS ధోనీ, కేసరీ’ మూవీల్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అక్షయ్ కుమార్ పక్కన సహాయ నటుడిగా సందీప్ కన్పించాడు
Read More »తెలంగాణలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే 500 పోస్టులతో పాటు ఇప్పటివరకూ భర్తీ జరగని 900 వైద్య పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్య సేవల నియామక మండలి ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఏడాదికి కనీసం రెండుసార్లు నియామక ప్రక్రియ జరగనుంది.
Read More »గురువారం తిరుపతికి సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రుయా ఆస్పత్రి సమీపంలో ఉన్న రిటైర్డ్ మేజర్ జనరల్ 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సైనికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
Read More »