ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి చేయాలంటే భయపడే స్థాయికి రావాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని విధానాలతో ముందుకు వెళ్లాలని చెప్పారు. అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. 14400 కాల్ సెంటర్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక, రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలను …
Read More »గొప్ప మనస్సును చాటుకున్న సచిన్
దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పెద్ద మనసు చాటుకున్నారు. బ్యాట్ల తయారీ దుకాణం నిర్వహించే అష్రఫ్ చౌదరీ అనే పెద్దాయనను ఆర్థికంగా ఆదుకున్నారు. గతంలో పాడైన సచిన్ బ్యాట్లను అష్రప్ బాగు చేసేవాడు. అష్రఫ్ స్నేహితుడు ప్రశాంత్ జఠ్మలాని తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారం సాగకపోవడంతో అష్రఫ్ చాచాను తీవ్ర ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దాంతోపాటు ఆరోగ్యం కూడా దెబ్బతింది. 12 రోజుల క్రితం ముంబైలోని …
Read More »హైదరాబాద్ లో సిటీ బస్సులు తిరుగుతాయా….?
హైదరాబాద్ లో ఆరు నెలలుగా నిలిచిపోయిన ప్రజా రవాణా తిరిగి పట్టాలెక్కనుందా? నిలిచిపోయిన సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్రం సెప్టెంబరులో మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న దృష్ట్యా గ్రేటర్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు, సిటీబస్సుల రాకపోకలపై ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు ఏ క్షణంలోనైనా వీటికి అనుమతి లభించవచ్చనే అంచనాలతో ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. లాంగ్ రూట్లకే పరిమితం.. ప్రభుత్వం అనుమతిస్తే ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు …
Read More »తెలంగాణలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటింది. అలాగే రోజురోజుకూ ఈ టెస్టులు భారీగా పెరుగుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్ మేరకు.. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా టెస్టులు 10,21,054 జరిగాయి. అందులో సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో అత్యధికంగా 52,933 పరీక్షలు నిర్వహించారు. దీంతో ప్రతీ 10 లక్షల జనాభాకు చేసిన నిర్ధారణ పరీక్షల సంఖ్య 27,502కు చేరింది. ఇక రాష్ట్రంలో …
Read More »కాలుష్య రహితంగా ఫార్మాసిటీ
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ‘టీ ఫైబర్’కార్యాలయంలో హైదరాబాద్ ఫార్మాసిటీపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు, ఆర్థిక, పురపాలక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఫార్మాసిటీలో తమ యూ నిట్ల ఏర్పాటుకు వందలాది ఫ్యాక్టరీలు ఎదు రు …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికే షాకిచ్చిన హ్యాకర్లు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన దుండగులు హ్యాక్ చేశారు. కేంద్ర మంత్రి కాకముందు ఈ వెబ్‌సైట్‌ను తన స్థానిక ఈవెంట్ల కవరేజీ కోసం ఆయన వినియోగించేవారు. కేంద్ర మంత్రి అయ్యాక ఈ వెబ్‌సైట్‌ను అంతగా వినియోగించడం లేదు. ఆగస్టు 15న ఈ వెబ్‌సైట్ హ్యాక్ అవగా.. ఆలస్యంగా గుర్తించినట్టు తెలుస్తోంది. వెబ్‌సైట్ హ్యాక్ అయినట్టుగా కిషన్‌రెడ్డి కార్యాలయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు …
Read More »మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు కరోనా
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కలెక్టర్‌కు మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయనతో పాటు పలువురు మంత్రులు సైతం పాల్గొడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సమావేశంలో కలెక్టర గౌతమ్‌తో సహా.. మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, …
Read More »కోవిడ్ ఉంటే ఎలా తెలుస్తుంది..?
జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. * లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు. * 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా పెరిగాయి. ఆయాసం ఎక్కువైంది. * సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ పరీక్ష …
Read More »కాళేశ్వరంతో మారిన రాష్ట్ర ముఖచిత్రం
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ముఖచిత్రం మారింది. బోరు ఎండేది లేదు.. బాయి దంగేది లేదు.. మోటరు వైండింగ్, జ నరేటర్, ఇన్వర్టర్ దుకాణాలు బంద్ అయ్యాయి. సాగునీటి గోస తీరడంతో వలసలు వెళ్లినోళ్లు సైతం తిరిగొస్తున్నా రు’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మం డల కేంద్రంతోపాటు జక్కాపూర్, గు ర్రాలగొంది, మల్యాల, గోపులాపూర్, మాటిండ్ల, బంజేరుపల్లి, లక్ష్మిదేవిపల్లిలో పలు …
Read More »పెళ్లి కొడుకుగా శర్వానంద్
2020 అస్సలు బాగోలేదని అందరూ పెదవి విరుస్తుంటే టాలీవుడ్‌లోని హీరోలు మాత్రం దీనికి మించిన శుభ ముహూర్తం దొరకదంటూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, నితిన్, రానా దగ్గుబాటి ఇప్పటికే వివాహలు చేసుకొని ఓ ఇంటివారయ్యారు. మరోవైపు మెగా డాటర్ నిహారిక ఎంగేజ్‌మెంట్ అవగా, ‘కృష్ణా అండ్ హిజ్ లీల’ నటి షాలిని తమిళ దర్శకుడు మనోజ్‌తో ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో యువ కథానాయకుడు …
Read More »