తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1610 కొత్త కేసులు వెలుగు చూశాయి. 9 మందివైరస్ వల్ల ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరగా 42,909 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.మొత్తం 13,753 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 480 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఇటు ఒక్క GHMC పరిధిలోనే 531 కొత్త కేసులు వెలుగు చూశాయి.
Read More »అచ్చెన్నాయుడుకి బెయిల్ వస్తుందా…?
ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి,టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి… బెయిల్ ఇవ్వాలా? లేదా? అనే దానిపై నేడు హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 45 రోజులు దాటింది. సాక్ష్యాల సేకరణ కూడా పూర్తయింది అటు ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ బెయిల్ పిటిషన్ …
Read More »ఏపీ ఆర్టీసీలో కరోనా కలవరం
ఏపీ ఆర్టీసీలో కరోనా కలకలం రేపుతోంది.ఇప్పటివరకు మొత్తం 670 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తొలుత రోజుకు సగటున 5-10 మందికి కరోనా సోకగా ఇప్పుడు రోజుకు 60-70 మంది సోకుతుంది అత్యధికంగా కడప జోన్లో 260 మంది వరకు కరోనా బారిన పడ్డారు. కాగా ఆర్టీసీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఏం చేయాలనే అంశంపై మంగళవారం ఉన్నతాధికారులతో ఎండీ చర్చించనున్నారు.
Read More »ఆగస్టు 5నుండి చేప పిల్లలు పంపిణీ
ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీని ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్రమత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో చేపపిల్లలను విడుదల చేయడంతో ఈ కార్యక్రమం మొదలు పెడతామన్నారు. ఈ ఏడాది 24 చెరువులు, రిజర్వాయర్లలో 81 కోట్ల చేప పిల్లలు, 78 నీటి వనరుల్లో 5 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నారు.
Read More »కరోనా కేసుల్లో ఏపీకి 4వ స్థానం
ఏపీలో ఇప్పటివరకు మొత్తం 1,02,349 కరోనా కేసులు నమోదయ్యాయి.. కేసుల సంఖ్యాపరంగా దేశంలో నాలుగో స్థానాన్ని ఏపీ చేరుకుంది. ఇక రోజువారీ కేసుల వృద్ధిపరంగా ఏపీ రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 60 శాతం కరోనా కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. అటు కేసుల డబ్లింగ్ లో ఏపీ తొలి స్థానంలో ఉంది.
Read More »సరికొత్తగా సాయిపల్లవి
వెబ్ సిరీస్ లో నటించేందుకు హీరోయిన్ సాయి పల్లవి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ కు సాయి పల్లవి ఓకే చెప్పిందట. పరువు హత్య నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు తెలుస్తుండగా.. నటుడు ప్రకాశ్ రాజ్ కూతురుగా ఆమె కనిపించనుందట. కాగా ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.
Read More »హోమ్ ఐసొలేషన్ కిట్స్ పంపిణీ
లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320B తరఫున హోమ్ ఐసొలేషన్ కిట్స్ కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు చేతుల మీదుగా పంపిణీ చేసిన లైన్స్ క్లబ్ ప్రతినిదులు. కరోనా వైరస్ సోకి ఇంటివద్దనే ఉంటున్న వారికి మందులు, శానిటైసర్లతో కూడిన కిట్స్ ను లైన్స్ క్లబ్ తరఫున పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే 20 లక్షల విలువ చేసే ppe కిట్స్ ను, N-95 మాస్క్ లను …
Read More »వైరల్అయ్యినవన్నీ నిజాలు కానక్కర్లేదు
ఏపీలో చిత్తూరు జిల్లాలో కూతుళ్లతో కాడి పట్టించిన రైతు, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, సోనూ సూద్ స్పందించి ట్రాక్టర్ పంపించడం… ఈ వ్యవహారం మొత్తం అడ్డం తిరిగింది. — ఆ వీడియోలోని రైతు వీరదల్లు నాగేశ్వరరావు మదనపల్లె టౌన్లో ఉంటారు. కరోనా టైములో పల్లెటూరు సేఫ్ అని వాళ్ళ సొంతూరు వెళ్లారు. — కరోనా టైములో ఒక తీపి గుర్తుగా ఉంటుందని వాళ్లే స్వయంగా నాగలితో ప్రయత్నం …
Read More »ఆ రైతుకు ఏపీ సర్కారు ఏమి చేసిందో తెలుసా..?
నటుడు సోనూసూద్. సహాయం చేసిన చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర్రావుకు ఏపీ ప్రభుత్వంనుంచి అందిన సహాయం. వివరాలు 1. గత ఏడాది రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో వేసిన ప్రభుత్వం 2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరులో, జనవరిలో బదిలీ. 3. నాగేశ్వర్రావు చిన్నకూతురుకు జగనన్న అమ్మ ఒడి కింద గత జనవరిలో …
Read More »మొక్కలు నాటిన విజయ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ఉప్పెన సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్న “తమిళ్ మక్కల్ సెల్వన్ ” విజయ్ సేతుపతి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో మొక్కలు నాటిన ఉప్పెన సినిమా లో ప్రముఖ …
Read More »