మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాదిరిగానే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కూడా అంతమొందించేందుకు జగన్ ప్రభుత్వం తీవ్రం కుట్రలు చేస్తోందని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఏలూరు సబ్ జైల్లో చింతమనేని ప్రభాకర్ ని పరామర్శించిన అనంతరం తెలుగుదేశం లీడర్లు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎల్లకాలం వైసీపీ ప్రభుత్వమే ఉండదని, తాము అధికారంలోకి వచ్చినప్పుడు అంతకంతకు బదులు కక్ష తీర్చుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. …
Read More »తిరుపతి తిరుక్కుడై ఉత్సవాన్ని ప్రారంభించిన విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు…!
చెన్నైలో తిరుపతి తిరుక్కుడై ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్లు ఈ తిరుపతి తిరుక్కుడై ఉత్సవాన్ని ప్రారంభించారు. హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ఈ రోజు ఉదయం జరిగిన సంప్రదాయబద్దంగా జరిగిన ఈ ఉత్సవంలో శ్రీ స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామిజీలు స్వయంగా గొడుగులకు హారతులిచ్చి గరుడసేవకు …
Read More »సాదాసీదాగా ఫ్రెండ్ తో పెళ్లిలో క్రింద కూర్చొని మాట్లాడుతున్న జగన్.. సింప్లిసిటీ..
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా జగన్ ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ మాట్లాడినా ఆయన అభిమానులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే జగన్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. జగన్ ఎన్ సీసీ ఫొటోలు, చిన్ననాటి ఫొటోలు కనిపించాయి. తాజాగా జగన్ తన స్నేహితుడి పెళ్లిలో …
Read More »మద్యం తాగేవారికి కోడిగుడ్లు, కోడి పకోడి, అరటి పళ్లు.. ఆఫర్లు ప్రకటిస్తున్న యజమానులు.. ఎందుకంటే
తక్కువ ధరకే మద్యం ఇచ్చేందుకు వైన్ షాపుల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెలతో పాత మద్యవిధానం ముగుస్తుండడంతో షాపుల్లోని మద్యాన్ని క్లియర్ చేసుకునేందుకు యజమానులు మద్యం ధరల్లో ఆఫర్లు ఇస్తున్నారు. మద్యం కొనుగోలు చేస్తే స్నాక్స్ ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.. టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన మద్యంషాపుల కాలపరిమితి జూన్ నెలాఖరుకు ముగుస్తుంది. అయితే అప్పటికేనూతన ప్రభుత్వం షాపుల గడువును మూడు నెలలు పొడిగించింది. అంతేకాకుండా మద్యంషాపుల్లో తప్పకుండా …
Read More »వర్ల రామయ్యకు నెలరోజులు గడువిచ్చిన ఏపీ ప్రభుత్వం
ప్రభుత్వం మారినా టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ‍్య మాత్రం ఆ పదవిని వదలడం లేదు. టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం ఏర్పడినా వల్ల పదవిని పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. దీంతో ఆ పదవినుంచి వైదొలగడానికి రాష్ట్రప్రభుత్వం వర్ల రామయ్యకు నెలరోజులు గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీకాలం కేవలం ఒక్క ఏడాది మాత్రమే ఉంటుంది. …
Read More »పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత…ఆందోళనలో మెగాభిమానులు…!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ సమయం నుంచి పవన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల వెన్నునొప్పి తీవ్రంగా మారడంతో గత రెండు మూడురోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. డాక్టర్లు వెన్నునొప్పి తగ్గాలంటే సర్జరీ అవసరమని చెప్పినా..పవన్ మాత్రం సంప్రదాయ వైద్యంపై మొగ్గుచూపుతున్నారు. తాజాగా విజయవాడలో మీడియా స్వేచ్ఛపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు …
Read More »గ్రామ వలంటీర్లకు శుభవార్త
రాష్ట్రవ్యాప్తంగా గ్రామవాలంటీర్లకు శుభవార్త వినిపించింది. వలంటీర్ల బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్ ఒకటో తేదీన వారి గౌరవవేతనం జమ చేయనున్నట్టు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏపీలో మొత్తం 1,92,848 మంది గ్రామ వలంటీర్లకు గాను 1,85,525 మంది నియామక ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వీరిలో అందులో 1,50,661 మందికి గౌరవ వేతన చెల్లింపులకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందినట్టు వివరించారు. వలంటీర్లకు ఒక్కొక్కరికి ఆగస్టు 15 నుంచి …
Read More »దసరా సెలవులు ప్రమాదానికి దారితీస్తాయా..? కాపాడాల్సిన భాద్యత మీదే ?
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శనివారం నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. పిల్లలకు సెలవులు ఇచ్చారని తల్లితండ్రులు ఆనందపడడం కాకుండా వారు గమనించాల్సిన మరియు పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అంశాలు గురించి తెలుసుకోండి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. కాబట్టి చెరువులు,కుంటలు,కాల్వలు,చెక్ డ్యాములు, వాగులు, వంకలు, జలాశయాలు, బావులకు పిల్లలను ఈతకు వెళ్లకుండా ఉండమని చెప్పాల్సిన బాధ్యత …
Read More »తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..!
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధం అయింది. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలో ఈ నెల 30 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేది వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దాదాపు రూ.7.53 కోట్లతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి రానుండడంతో …
Read More »రోడ్డు ప్రమాదంలో మాజీమంత్రి దుర్మరణం..సీఎం జగన్ నివాళి…!
మాజీ మంత్రి, డీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నాయకుడు, ప్రజల మనిషిగా పేరుగాంచిన బలిరెడ్డి సత్యారావు (83)ఇక లేరు. నిన్న సాయంత్రం వాకింగ్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బలిరెడ్డి స్థానిక మైక్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఇవాళ ఉదయం మహారాణి పేటలో బలిరెడ్డి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి, అంజలి ఘటించి, కుటుంబసభ్యులను పరామార్శించారు. ఈ సందర్భంగా బలివాడ …
Read More »