Home / ANDHRAPRADESH (page 405)

ANDHRAPRADESH

ఎక్స్‌క్లూజివ్…బాబు అండతో చెలరేగిపోయిన పచ్చనేతల పాపం పండింది…!

గత ఐదేళ్లు అధికారంలో ఉన్నామనే అహంకారంతో, చంద్రబాబు, లోకేష్‌ల అండతో.. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతూ…సహజవనరులు దోచుకుంటూ, ప్రజల దగ్గర ట్యాక్స్‌లు వసూలు చేస్తూ… అరాచక పాలన చేసిన టీడీపీ నేతల పాపం పండింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో  బెంబేలెత్తిన కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ, కూనరవికుమార్, చింతమనేని, యరపతినేని, వంటి టీడీపీ నేతలు …

Read More »

చంద్రబాబుకు షాక్…బీజేపీలోకి మాజీ మంత్రి…కడప టీడీపీ ఖాళీ…?

  కడప టీడీపీ కుప్పకూలుతుందా..గత ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిలపడిన తెలుగుదేశం పార్టీ…కడపలో పూర్తిగా సమాధి కాబోతుందా..జిల్లాలో కీలక నేతలంతా కాషాయ గూటికి చేరుకుంటున్నారా…ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. తాజాగా మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్లే తాను కాషాయతీర్థం పుచ్చుకున్నట్లు ఆదినారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో …

Read More »

రేపు సీఎం జగన్ ఇడుపులపాయకు..!

సెప్టెంబరు 2వ తేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కడప జిల్లా పర్యటనకు వస్తున్నారని, పర్యటన విజయవంతానికి పటిష్ఠవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ హరి కిరణ్‌ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇడుపులపాయ, పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందన్నారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం ప్రత్యేక విమానంలో సీఎం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయకు వెళతారన్నారు. వైఎస్సార్‌ ఘాట్‌ …

Read More »

చింతమనేని కోసం.. ప్రత్యేక బృందాలు గాలింపై..ఎస్పీ ..డీఎస్పీ సీరియస్

దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యాన్ని నెలకొల్పి పదేళ్లుగా అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన చింతమనేని ప్రభాకర్‌ పరారీ కావడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దళిత యువతపై దాడికి యత్నించిన సంఘటనలో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు కావడంతో శుక్రవారం పోలీసుల కళ్లు కప్పి ఉడాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. ఐదుగురు సీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించి గాలిస్తున్నారు. శనివారం చింతమనేని ఇంటికి వెళ్లిన …

Read More »

అన్న క్యాంటీన్లలో భారీ అవినీతి…తేల్చిచెప్పిన నిపుణుల కమిటీ…?

ఏపీలో గత కొద్ది రోజులుగా అన్న క్యాంటీన్లను మూసివేసారంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేష్‌లతో సహా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బాబు సర్కార్ రాష్ట్రమంతటా అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఈ అన్న క్యాంటీన్ల నిర్మాణంలో టీడీపీ పెద్దలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అన్నక్యాంటీన్లలో జరిగిన అవినీతి బాగోతాలపై …

Read More »

వైసీపీలో చేరిన విశాఖ డైరీ చైర్మన్‌ కొడుకు..టీడీపీ కీలక నాయకులు

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ కీలక నాయకులు వైసీపీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్‌ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్‌, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆదివారం వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అడారి ఆనంద్‌ పరాజయం పాలయ్యారు. …

Read More »

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే సుమారు15 లక్షల మందికి పైగా పరీక్షలకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు. ఇక 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరిగే పరీక్షలను 6,19,812 మంది రాయనున్నారని తెలిపారు. …

Read More »

శేషాచలం అడవుల్లో ఏసుమందిరం అంటూ దుష్ప్రచారం… టీడీపీ సానుభూతిపరుడిపై కేసు నమోదు…!

తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ ప్రతిష్ట మంటగలిసేలా టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలకు పాల్పడుతోంది.  కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి పరిధిలోని శేషాచల కొండల్లో అటవీ శాఖ అధికారులు నిర్మించిన వాచ్‌టవర్ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, ఏడుకొండలపై ఏసు మందిరాలు అంటూ..వాట్సాప్ ద్వారా ప్రచారం చేసిన వ్యక్తిపై టీటీడీ కేసు నమోదు చేసింది. అరుణ్ కాటేపల్లి అనే వ్యక్తి “అణువణువునా హిందూత్వం” అనే గ్రూపు నుంచి …

Read More »

ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని సీఎం వైఎస్ జగన్ పిలుపు

పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. గుంటూరు జిల్లా డోకిపర్రు వద్ద మొక్కను నాటి సీఎం వనమహోత్సవానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతగానో దోహద పడతాయని.. దీనిని దృష్టిలో పెట్టుకుని విరివిగా మొక్కలు నాటేలా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని డోకిపర్రు అడ్డరోడ్డు వద్ద శనివారం జరిగే …

Read More »

అక్టోబరు 2 నుంచి అన్ని గ్రామ సచివాలయాల భవన నమూనా ఇదే

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామ సచివాలయాలు ఇక వైసీపీ రంగుల్లోకి మారిపోనున్నాయి . అక్టోబరు 2 నుంచి అమలులోకి వచ్చే గ్రామ సచివాలయాల భవన నమూనాను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లాలకు పంపింది. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న పంచాయతీ భవనాలను ఇదే విధంగా మార్పులు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసే చోట ఇదే విధానాన్ని అమలు చేయాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ కలెక్టర్లకు సూచించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat