ఈ రోజు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి షిర్డీని సందర్శించారు. షిర్డీ సాయిబాబా ఆలయం నందు మధ్యాహ్నం హారతిలో సతీసమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ట్రస్టులో వైవీ సుబ్బారెడ్డి దంపతులు భోజనం చేశారు. అక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించడానికి చేపడుతున్న చర్యలను స్వయంగా పరిశీలించారు.
Read More »ప్రశాంతంగా ముగిసిన గ్రామ సచివాలయ పరీక్షలు
గ్రామ సచివాలయ ఉద్యోగ తొలి రోజు పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే 11,58,538 మంది హాజరు కాగా, 95,436 మంది గైర్హాజరు అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 92.50శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. విజయనగరంలో 93.60, శ్రీకాకుళం 93.47, పశ్చిమ గోదావరి 93.46, తూర్పు గోదావరి 92.71, విశాఖపట్నం 92.48, కృష్ణా …
Read More »తెలుగు ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!
సెప్టెంబర్ 2 న వినాయకచవితి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుతూ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మట్టిగణపతినే పూజించండి..పర్యావరణాన్ని పరిరక్షించండి.. అంటూ ఆయన పిలుపునిచ్చారు.
Read More »జనసేన కార్యకర్త ఘరనా మోసం..!
ఆటో కార్మికులను మోసం చేసిన జనసేన పార్టీ కార్యకర్తపై తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. జగ్గంపేట మండలం మామిడాడకు చెందిన శరకణం గణేష్ అనే జనసేన పార్టీ కార్యకర్త కొద్ది రోజుల క్రితం యర్రవరంలో మాధవీలత ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఆటోలు కొనుగోలుకు లక్ష రూపాయలు కడితే అంతే మొత్తంలో జనసేన పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్తల నుండి ఉచిత సబ్సిడీ వస్తుందని డ్రైవర్లను నమ్మించాడు. …
Read More »జగన్ సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా కామెంట్స్
టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ యైభుత్వ తీరుపై విమర్శలు చేశాడు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలన 100 తప్పటడుగులు, 100 తడబాట్లుగా సాగుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడుపై కక్షతో మద్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విమర్శించారు. ఇసుక టెండర్లను వైసీపీ వాళ్లకు ఇవ్వడం సిగ్గుచేటని పేర్కొన్న డొక్కా, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు …
Read More »ఏపీలో చౌక ధరకే ఇసుక..టన్ను ఏంతో తెలుసా
ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం కొత్తగా తీసుకువస్తున్న ఇసుక విదానంలో చౌకగా ఇసుక దొరికే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో టన్నుకు 126=50 ఉండగా, ఏపీలో దానిని 375 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. అది కూడా రవాణా వ్యయంతో కలిపి నిర్ణయించారు.దీనివల్ల వినియోగదారులపై గతంలో తక్కువ దరకు ఇసుక దొరికే పరిస్తితి వచ్చింది.ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, ఇసుక సరఫరా ధరను అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని …
Read More »రామసుబ్బారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్…!
జమ్మలమడుగులో దశాబ్దాలుగా ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ తగాదాల్లో ఎందరో అమాయకులు బలైపోయారు. అయితే 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డిని ప్రలోభపెట్టి తన పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చాడు. దీంతో ఆ ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డిపై ఓడిపోయిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వర్గం మండిపడింది. …
Read More »సీఎం వైఎస్ జగన్ కు చంద్రబాబు నాయుడు లేఖ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణానది వరదల విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన ఆరోపించారు. సహాయ చర్యలలో నిర్లక్ష్యం కనిపించిందని ఆయన చెప్పారు. ప్రకాశం బారేజీ వద్ద నీటిని సకాలంలో తగ్గించలేదని, ఒకేసారి రెండున్నర లక్షల క్యూసెక్యుల నీరు వదలడంతో లంక గ్రామాలు ముంపునకు గురి అయ్యాయని ఆయన అన్నారు.తన ఇంటికి నోటీసులు ఇవ్వడం, డ్రోన్ లు వేయడంలో …
Read More »ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలి.. సీఎం జగన్
వినాయక చవితి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలన్నారు. ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
Read More »జనసేనానిపై ఎంపీ విజయసాయిరెడ్డి అదిరిపోయే సెటైర్…!
చంద్రముఖి సినిమా గుర్తుంది కదా…అందులో చంద్రముఖిలా మారిన హీరోయిన్ జ్యోతికను చూపిస్తూ …చూడు పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడు అంటూ..ప్రభుతో అంటాడు. సేమ్ టు సేమ్..పూర్తిగా చంద్రబాబులా మారిన పవన్ కల్యాణ్‌ను చూడు అంటూ..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైటైర్ వేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కృష్ణానది వరదల నేపథ్యంలో రాజధానిగా అమరావతి సేఫ్ కాదని, నిర్మాణాలకు రెట్టింపు ఖర్చు అవుతుందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ….గత కొద్ది రోజులుగా …
Read More »