ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షల ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం రిజల్ట్స్ వెల్లడిస్తామని ఏపీ విద్యాశాఖ అధికారులు తొలుత ప్రకటించారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని చెప్పినా చేయలేదు. ఆ తర్వాత విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేస్తూ ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. సాంకేతిక కారణాలతో వాయిదా వేశామని.. ఈనెల 6న (సోమవారం) రిజల్ట్స్ విడుదల చేస్తామన్నారు. అయితే సోమవారం ఎన్నిగంటలకు రిలీజ్ చేస్తారనేది అధికారులు చెప్పాల్సి …
Read More »అవమానాలు తట్టుకోలేకే టీడీపీకి రాజీనామా: దివ్యవాణి
గతకొంతకాలంగా టీడీపీలోని అన్ని కార్యక్రమాలకు తనను దూరం పెడుతున్నారని.. పార్టీలో అవమానాలు తట్టుకోలేకే రాజీనామా చేసినట్లు సినీనటి దివ్యవాణి తెలిపారు. టీడీపీకి రాజీనామా చేసినట్లు తొలుత వీడియో సందేశం ద్వారా ప్రకటించిన ఆమె.. గురువారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించి జరిగిన పరిణామాలను, తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. కనీసం ప్రెస్‌మీట్ పెట్టేందుకు కూడా ఎవరూ తనకు సహకరించలేదన్నారు. ఈ విషయాలపై చంద్రబాబును కలిసి వివరిద్దామనుకున్నా ఆయన్ను కలవనివ్వలేదని చెప్పారు.
Read More »వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సెంట్రల్ ఆఫీస్‌ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చి ఫిర్యాదులు.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నరసాపురం నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా అక్కడి వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుతో …
Read More »ఆత్మకూరు పోరు.. విక్రమ్‌రెడ్డికి బీఫారం అందించిన జగన్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ తరఫున బీఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More »ఏపీలో అవినీతి నిరోధానికి ఏసీబీ యాప్.. ఆవిష్కరించిన సీఎం జగన్
ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏసీబీ రూపొందించిన ఈ యాప్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ‘ఏసీబీ 14400’గా దీనికి నామకరణం చేశారు. ప్రభుత్వశాఖల్లో ఎవరైనా లంచం అడిగితే ఈ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని సీఎం జగన్ చెప్పారు. ఫిర్యాదుతో పాటు తమ దగ్గర ఉన్న వీడియో, ఆడియో డాక్యుమెంట్లను ఏసీబీకి పంపొచ్చన్నారు. కంప్లైంట్ చేయగానే ఫిర్యాదుదారు మొబైల్‌కు రిఫరెన్స్ …
Read More »దావోస్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న జగన్.. నేతల ఘనస్వాగతం
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎంకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వల్లభనేని వంశీ, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు స్వాగతం పలికారు.
Read More »చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: పెద్దిరెడ్డి
కుప్పంలో మైనింగ్ మాఫియా జరుగుతోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కేవలం ఎన్నికల అస్త్రంగా ఉపయోగపడుతుందనే ఆయన అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన సామాజిక భేరి ముగింపు సభ విజయవంతమైందని ఆయన చెప్పారు. 2024లో జరిగే ఎన్నికలే చంద్రబాబుకు చివరివని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయభేరి ముగింపు …
Read More »టీడీపీకి ఎంతో సేవ చేశా.. అయినా నన్ను అవమానించారు: దివ్యవాణి
పార్టీ కోసం ఎంతో చేసినా తనను తీవ్రంగా అవమానించారని సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ ద్వారా ఆమె ప్రకటించారు. కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడితే కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయిందన్నారు. మహానాడు వేదికగా తనను అవమానించారని ఆరోపించారు. ఒక కళాకారుడు (ఎన్టీఆర్) స్థాపించిన పార్టీలో కళాకారులు …
Read More »రాబోయే రోజుల్లో మరింతగా సేవ చేస్తా: సీఎం జగన్
సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసి, వైకాపా ప్రభుత్వం ఏర్పడి నేటితో మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జగన్ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు కృజ్ఞతలు తెలిపారు. ‘‘మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు …
Read More »ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా చంద్రబాబుకు లాభం లేదు: అంబటి
బడుగు, బలహీనవర్గాల పక్షపాతి సీఎం జగన్ అని.. వారికి ఆయన సామాజిక న్యాయం చేశారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అంబటి మాట్లాడారు. బస్సు యాత్రకు ప్రతి చోటా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా లాభం లేదని.. …
Read More »