Home / ANDHRAPRADESH / ఏపీలో అవినీతి నిరోధానికి ఏసీబీ యాప్‌.. ఆవిష్కరించిన సీఎం జగన్‌

ఏపీలో అవినీతి నిరోధానికి ఏసీబీ యాప్‌.. ఆవిష్కరించిన సీఎం జగన్‌

ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏసీబీ రూపొందించిన ఈ యాప్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ‘ఏసీబీ 14400’గా దీనికి నామకరణం చేశారు.

ప్రభుత్వశాఖల్లో ఎవరైనా లంచం అడిగితే ఈ యాప్‌ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని సీఎం జగన్‌ చెప్పారు. ఫిర్యాదుతో పాటు తమ దగ్గర ఉన్న వీడియో, ఆడియో డాక్యుమెంట్లను ఏసీబీకి పంపొచ్చన్నారు. కంప్లైంట్‌ చేయగానే ఫిర్యాదుదారు మొబైల్‌కు రిఫరెన్స్‌ నంబర్‌ వస్తుందని చెప్పారు. అవినీతిని నిరోధించేందుకు ఈ విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నట్లు సీఎం తెలిపారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar