2019 ఎన్నికల్లో పర్చూరు పీఠం అధిష్టించేదెవరు.. జనసేవ ప్రభావం ఎవరికి ఇబ్బంది.. అధికార పార్టీ తన సీటును కాపాడుకునేనా.. జగన్ చరిష్మా, వైసీపీలో కొనసాగుతున్న చేరికలతో దగ్గుబాటి విజయం నల్లేరుపై నడకేనా? అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ సారి కులం కార్డు ప్రభావం ఎంతో అంచనా వేయడం కష్టంగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు బరిలో ఈసారి అత్యధికంగా 15 మంది పోటీపడుతున్నా.. …
Read More »రాయచోటిలో నిన్ను నమ్మం బాబూ అంటున్న మహిళలు..!
మరో తొమ్మిది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. అయితే అదే గత 5 సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తుందని, దాంతో ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని, ఏపీలో ఇప్పుడు అంతులేని సమస్యలు తాండవం చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదని నిన్ను నమ్మం బాబు అంటూ వైసీపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో బాగాంగానే కడప జిల్లా రాయచోటి మండలం యండపల్లి గ్రామం పూసల కాలనీలో …
Read More »జగనన్న మంచి పరిపాలన అందిస్తారు.. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి
జనసేనకు పార్టీకి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లే అని వైయస్ షర్మిల అన్నారు. పవన్ కల్యాణ్ యాక్టర్, ఆయన రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరక్టర్. అందుకే పవన్ చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారని అన్నారు. జనసేనకు ఒటేస్తే కచ్చితంగా చంద్రబాబుకు ఒటేసినట్టేనన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియాతో వైసీపీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తెనాలిలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఇళ్లు, ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని తెలిపారు. …
Read More »పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ..ఓటుకు ఎంతో తెలుసా
ఏపీలో మరో 9 రోజుల్లో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు బరితెగింపులకు దిగుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు ఆరు వేల రూపాయలు పంచుతున్నట్టు ప్రచారం జరగుతోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో పరిటాల సునీత నిర్వాకం బట్టబయలైంది. …
Read More »ఉక్కునగరంలో సత్తా చాటేదెవరు.? జోన్ క్రెడిట్ ఎవరికి.? గిరిజనుల ఓట్లు ఎవరివైపు.? భూకబ్జాలు కబళిస్తాయా.? దరువు గ్రౌండ్ రిపోర్ట్..
విశాఖపట్నం.. హైదరాబాద్ కంటే ముందే గ్రేటర్ హోదా పొందిన నగరం.. సుందరమైన సముద్ర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ జిల్లా.. అలాంటి జిల్లా ఇప్పుడు తాజా రాజకీయాలతో వేడెక్కుతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలోనే అతి పెద్ద నగరమైన విశాఖ పార్లమెంట్ స్థానానాలతో పాటు జిల్లాలో ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడానికి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సుబ్బరామిరెడ్డి, ఎంవీవీఎస్ మూర్తి, …
Read More »చంద్రబాబుకు ఓటు వేస్తే మన రాష్ట్రం…?జగన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ అధినేత జగన్. పొరపాటున కూడా బాబుకు ఓటు వేయకండి ఒకవేళ అలా చేస్తే రాష్ట్రంలో మనకి ఏమీ మిగలవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఇసుకలారీ రేటు రూ.40,000 ఉంది,బాబు మరోసారి గెలిస్తే ఒక్కసారిగా లక్షరూపాయలకు పెరిగిపోతుందని విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.నేను అధికారంలోకి రాగానే …
Read More »పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా, పిల్లి పిల్లే..పులి పులే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభలో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని, కుల,మత, పార్టీలకు అతీతంగా న్యాయం చేసిన ఏకైక నాయకుడు వైఎస్సార్ అని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడున్న చంద్రబాబు పాలనలో రైతులకు …
Read More »వామ్మో ఏపీలో ఓటుకు రూ.12 వేలు..!
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులకు తోడు ప్రతిపక్ష వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుండటం, లోకేశ్ ఓటమి సంకేతాల నేపథ్యంలో చంద్రబాబులో ఆందోళన మొదలయ్యింది. భారీయెత్తున డబ్బులు వెదజల్లి కొడుకుని గెలిపించేందుకు తెలుగుదేశం అధినేత స్కెచ్చేశారు. మొత్తం మీద రూ.300 కోట్లకు పైగా సొమ్మును మంగళగిరిలో కుమ్మరించాలని నిర్ణయించినట్లు ఒక వార్త పత్రిక కథనం ప్రచురించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా …
Read More »బ్రేకింగ్ న్యూస్ వైసీపీలో చేరిన..హీరో రాజశేఖర్, జీవిత
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరింత దగ్గరగా ఉండండతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు జై కొడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పోసాని, ఆలీ, హీరో తనీష్ ఇలా చాలమంది జగన్ కు జై కొట్టారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత రాజశేఖర్ దంపతులు …
Read More »వైయస్ భారతికి బ్రహ్మరధం పడుతున్న జమ్మలమడుగు ప్రజలు
వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన భార్య వైయస్ భారతి కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఆమె రోడ్‌షో నిర్వహించారు. భారతికి జమ్మలమడుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని, చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. వైఎస్ జగన్‌ను ప్రజలు బాగా …
Read More »