ఏపీలో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాకినాడ పర్యటనలో బిజిబిజీగా ఉన్న ఆయన ఇవాళ అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర బాబు మాట్లాడుతూ.. ఎన్నికల్లో పొత్తుల ప్రస్తావన తెచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిఉందని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమం అనేది రావాలని.. దానికి తెలుగుదేశం …
Read More »మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గుండెపోటుతో మృతి
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత… మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ రోజు కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం చంద్రబాబు కాబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. గోపాలకృష్ణారెడ్డి మృతిపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read More »వాళ్లే టెన్త్ పేపర్లు లీక్ చేశారు: సీఎం జగన్
వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే టెన్త్ పరీక్షల పేపర్లను లీక్ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. టీడీపీకి మాజీ మంత్రి నారాయణకు చెందిన శ్రీ చైతన్య, నారాయణ స్కూల్స్ నుంచే పేపర్లు లీక్ అయ్యాయన్నారు. తిరుపతిలో జగనన్న విద్యాదీవెన నిధులను సీఎం విడుదల చేశారు. గత ప్రభుత్వాలేవీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదని.. ఇప్పుడు తాము ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని …
Read More »గృహ వినియోగదారులకు పవర్ కట్ ఇబ్బందులొద్దు: సీఎం జగన్
రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో అదనంగా కెపాసిటీని జోడించాలని.. తద్వారా విద్యుత్ కొరతను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ బి.శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్లాంట్లలో 800 మెగావాట్ల చొప్పున అదనపు యూనిట్లను త్వరగా ప్రారంభించాలని …
Read More »YCP Mp సంజీవ్ కుమార్ కు షాక్
ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ సంజీవ్ కుమార్ ను సైబర్ నేరగాడు బురిడీ కొట్టించాడు. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది.. వెంటనే పాన్ నంబరుతో జత చేసి అప్ డేట్ చేసుకోవాలని సదరు ఎంపీకి మెసేజ్ వచ్చింది. దానిని నమ్మి లింకులో వివరాలు నింపి పంపగా ఓటీపీ వచ్చింది. ఓ వ్యక్తి ఎంపీకి ఫోన్ చేసి OTP, ఇతర వివరాలు తెలుసుకున్నాడు. …
Read More »సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు. క్రమశిక్షణతో ఉండటం, ఐకమత్యంతో మెలగడం, పేదలకు తోడ్పడటం రంజాన్ మానవాళికి ఇచ్చే సందేశమని …
Read More »ముంబయిలో శ్రీవారి ఆలయానికి రూ.500కోట్ల స్థలం..
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 5 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. నడక దారి భక్తులకి దివ్యదర్శనం టికెట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం స్లాట్ విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం, పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల …
Read More »టీడీపీ వాళ్లే నాపై దాడి చేయించారు: వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
జి.కొత్తపల్లిలో వైసీపీ నేతలు తనపై దాడి చేయలేదని..టీడీపీ వాళ్లే వెనకుండి దాడి చేయించారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో తనపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. జి.కొత్తపల్లిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని.. వారి మధ్య వివాదాన్ని రాజీ చేసినట్లు చెప్పారు. వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. హత్యకు గురైన గంజి …
Read More »సీఎం కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ మంత్రి ఆర్కే రోజా కలిశారు. తన కుటుంబంతో కలిసి ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. కేసీఆర్‌కు ఆయన ఫొటో ఫ్రేమ్‌ను జ్ఞాపికగా రోజా అందజేశారు. అంతకుముందు రోజాకు సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత స్వాగతం పలికారు. భర్త సెల్వమణి, కుమార్తె, కుమారుడితో కలిసి …
Read More »టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లు వద్దు: జగన్
యూనివర్సిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత చాలా ముఖ్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ టీలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు తీసుకురావాలని జగన్ అభిప్రాయపడ్డారు. టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లకు అవకాశం లేదని.. సమర్థులు, టాలెంట్ ఉన్నవారినే తీసుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహించిన టీచింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీల్లో …
Read More »