ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ,ఏపీసీ ఛైర్మన్ అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సాక్షిగా టీడీపీ సర్కారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని దుమ్ము దులిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు సంధించారు . ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటో కొమ్మినెని ఇన్ఫో నుండి మీకోసం .. 1 రాజధాని బాండ్ల విషయంలో వడ్డీరేటు 10.5 శాతం కాదు, 10.32 శాతమేనంటూ సీఆర్డీఏ …
Read More »అవినీతి అక్రమాలు, అంతులేని వివక్షతో విసిగిపోయిన ప్రజలు..జగన్ భరోసా కోసం ఎదురుచూపు
ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర గురువారం యలమంచలి నియోజకవర్గంలో అడుగుపెట్టనుంది. ఈ నెల 14న జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ముగిసి యలమంచలిలో ప్రవేశించనుంది. గురువారం పాయకరావుపేట మండలం ఎస్.రాయవరం మండలం దార్లపూడి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఏటికొప్పాక వద్ద యలమించిలిలో అడుగు పెట్టనుంది. తొలిరోజు ఏటికొప్పాక, పధ్మనాభరాజుపేట, పులపర్తి మీదుగా పురుషోత్త పురం వరకు సాగనుంది. …
Read More »బూతులు, రాయలేని భాషతో సొంతపార్టీనేతలపైనే రెచ్చిపోయిన ప్రభుత్వ విప్
అధికార తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదాస్పద రీతిలో ప్రవర్తించారు. ఎమ్మెల్యే అన్న పేరే కానీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. జిల్లాలో తాను చెప్పిందే వేదంగా, తన ఏరియా కాకపోయినా ఎక్కడైనా పంచాయితీ చేస్తూ నిత్యం దూకుడు ప్రదర్శించే చింతమనేని గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడినందుకు ఆమెపై చేయిచేసుకున్నాడు. అలాగే గతంలో నూజివీడులో కేవలం బస్సు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి …
Read More »ఏపీలో 30 నుండి 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు నో టికెట్ ..!
తెలుగుదేశం పార్టీ అదినేత మఖ్యమంత్రి చంద్రబాబు కూడా ముందస్తుగానే వచ్చే ఎన్నికలలో పోటీచేసే 40 మంది అభ్యర్ధులను ప్రకటిస్తారని టీడీపీ అనూకుల మీడియాలో ఒక వార్త వచ్చింది. రాఫ్ట్రా వ్యాప్తంగా ఏఏ నియోజకవర్గాలలో అభ్యర్దులను ప్రకటించాలన్నదానిపై ఇప్పటికే స్పష్టత వచ్చిందట. ప్రస్తుత సిటింగ్లలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లభించే అవకాశం లేదు. అలాంటి వారి జాబితాను కూడా తెలుగుదేశం సిద్ధంచేస్తోందని చెబుతున్నారు. ఈ నాలుగేళ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని.. …
Read More »అమ్మాయిలకు సర్టిఫికెట్ కావాలంటే నాకు ఏమిస్తావని అడిగేవాడు.. 40మందిని లైంగికంగా
కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్యానికి పాల్పడడం ప్రస్తుతం కలకలం రేగుతోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు శ్రీకాంత్ సెల్ఫీ వీడియో తీసుకుని పలు కారణాలు వెల్లడించాడు. పురుగులమందు తాగడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు వీర లంకయ్య తనపై కక్ష సాధిస్తున్నాడని శ్రీకాంత్ ఆరోపించారు. నా మీద కోపంతో క్రీడాకారులను ఇబ్బంది పెడుతున్నారు. టీమ్ సభ్యులను కబడ్డీకి దూరం చేస్తున్నారు. కబడ్డీ ఆటగాళ్లకు …
Read More »అనంతపురం ఆర్ట్స్ కళాశాల వసతి గృహంలో అమ్మాయి కోసం గొడవ..!
అమ్మాయి కోసం విద్యార్థులు ఘర్షణపడ్డారు. ఏకంగా రాళ్లు, కట్టెలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో గొడవ సద్దుమణిగింది. వివరాల్లోకెళితే.. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల వసతి గృహంలో మంగళవారం ఇద్దరు విద్యార్థులు అమ్మాయి విషయంలో గొడవపడ్డారు. తొలుత జూనియర్ విద్యార్థిపై సీనియర్లు చేయి చేసుకున్నారు. దీంతో సదరు విద్యార్థి బంధువులను వెంటతీసుకుని సాయంత్రం ఆర్ట్స్ కళాశాల వసతిగృహం వద్దకు వచ్చాడు. సీనియర్లతో …
Read More »మాతృత్వానికి మచ్చ..అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకును
అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న ఓ మహిళ మాతృత్వానికి మచ్చ తెచ్చేలా అమానుషానికి పాల్పడింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని 17 ఏళ్ల కొడుకును కడతెర్చింది. మానవ సంబంధాలను మంటగలిపే ఈ దారుణమైన ఘటన విజయనగరం పట్టణంలోని గాయత్రీ నగర్లో చోటుచేసుకుంది. గాయత్రీనగర్కు చెందిన వెంకట పద్మావతి కొడుకు ముదునూరి హరి భగవాన్ విజయనగరంలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అతను మంగళవారం నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. తల్లి వెంకట …
Read More »సెప్టంబర్ 6నుంచి వర్షాకాల సమావేశాలు.. జగన్ అసెంబ్లీకి రావాలని కోరనున్న స్పీకర్.. ఫిరాయింపుదారులపై
అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేతలపై వేటు వేసేంత వరకు తాము సభలకు వచ్చేది లేదని గతంలో వైసీపీ ప్రకటించింది. కానీ మధ్యలో రాజ్యసభ ఎన్నికలు ఉండటంతో స్పీకర్ కోడెల ఆహ్వానంతో ఒకరోజు ఆపార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ఓటువేసారు. గతంలో సభకు రావాలని స్వయంగా స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఫోన్ చేసి మరీ ఆహ్వానించినా జగన్ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు …
Read More »దమ్ముంటే రా..వైఎస్ జగన్ ..టీడీపీ ఎమ్మెల్యే అనిత తీవ్ర వాఖ్యలు
ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సోమవారం పాదయాత్రలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవురట్లలో టీడీపీ నేతలపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ జగన్ చేసిన విమర్శలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంగళవారం స్పందించారు. ఆరోపణలపై దమ్ముంటే జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్కు ఏపీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ధ్వజమెత్తారు. అనవసర …
Read More »స్థానికంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఘటన..!
మాజీమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశంజిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసులు రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బాలినేని ఓ స్థానికంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఒంగోలు వెళ్తునన్న సమయంలో ఒంగోలు సమీపంలోని త్రోవగుంటకు రాగానే దగ్గర బాలినేని ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా టైరు బరస్ట్ అయింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పాడవడంతో కారు అదుపు తప్పబోయింది. డ్రైవర్ అప్రమత్తతతో కారును అదుపు చేసాడు. దీంతో …
Read More »