ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,673 టెస్టులు చేయగా.. కొత్తగా 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 397 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. నిన్నటి కంటే 400పై చిలుకు కేసులు నమోదయ్యాయి.
Read More »నా హత్యకు కుట్ర జరుగుతుంది..
ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తన హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం జార్ఖండికి చెందిన ఓ ముఠాతో చర్చలు జరిగాయని అన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏ వ్యక్తి అయిన నచ్చకపోతే ఆ వ్యక్తిని తీసేస్తారు. మెగాస్టార్ చిరంజీవిని అల్లరి …
Read More »TDP నేత పరిటాల శ్రీరామ్ కి కరోనా
ఏపీలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తల్లి సునీతతో కలసి ధర్మవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కలసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.
Read More »ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38,816 టెస్టులు చేయగా.. కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 418 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,313 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.
Read More »పాలిటిక్స్ రీఎంట్రీపై చిరంజీవి క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ అధినేత, సీఎం జగన్మోహాన్ రెడ్డితో భేటీ నేపథ్యంలో తనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ వస్తున్న వార్తలను ఖండించారు చిరంజీవి. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు రూమర్స్ మాత్రమే అని.. అలాంటి ఆఫర్లు తన వద్దకు రావని చిరంజీవి స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. పదవులకు అతీతంగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. ఇక, తాను సీట్ల ఆఫర్లకు ఆశపడేవాడిని కాదని, అలాంటివి కోరుకోవడం లేదని …
Read More »రాజ్యసభ సీటుపై మెగాస్టార్ క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.మెగాస్టార్ చిరంజీవి ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిసిన సంగతి తెల్సిందే. అప్పటి నుండి మెగాస్టార్ కు రాజ్యసభ సీటు ఖరారైందని వార్తలు చక్కర్లు కొట్టాయి.. దీంతో తనకు రాజ్యసభ సీటు అన్న వార్తలను ఖండించారు మెగాస్టార్ చిరంజీవి.. మరోసారి ఈ అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం.. సీఎం జగన్ ను …
Read More »సీఎం జగన్ కు బాబు వార్నింగ్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన కార్యకర్తలు రెండేళ్లు ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హత్యకు గురైన టీడీపీకి చెందిన సీనియర్ నేత తోట చంద్రయ్య కుటుంబాన్ని ఆ పార్టీ అధినేతగా నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అంతకుముందు ఆయన చంద్రయ్య పాడే మోశారు. ‘ఈ హత్యపై సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పటికే 33మంది …
Read More »చిరు-జగన్ భేటీపై నాగ్ సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి,ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డిల భేటీపై టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున స్పందించాడు. ‘మా’ అందరి కోసమే చిరంజీవి జగన్తో సమావేశమయ్యారు. సినిమా విడుదల ఉండడం వల్ల నేను వెళ్లలేకపోయా. జగన్కు చిరంజీవి అంటే ఇష్టం. చిరంజీవి వెళ్తా అన్నారు.. నేను వెళ్లమని సలహా ఇచ్చా. ఇద్దరి భేటీతో ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. టికెట్ రేట్లపై స్పందించింది నా సినిమా వరకు …
Read More »ఏపీలో కొత్తగా 4,348మందికి కరోనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా చేరుకుంటోంది. గడిచిన 24 గంటల్లో 47,884 మందికి పరీక్షలు చేయగా 4,348మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం 14,204యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తంగా 20,92,227కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మొత్తం 14,507 మంది కరోనా కారణంగా మరణించారు.
Read More »సీఎం జగన్ తో చిరంజీవి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి గురువారం మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలవనున్నారు . వీరిద్దరి మధ్య ఈ రోజు మధ్యాహ్నం మర్యాదపూర్వక లంచ్ భేటీ జరగనుంది. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read More »